iDreamPost

Maratha Mandir: షారుఖ్‌ను భారీగా దెబ్బ తీసిన సలార్‌.. ఇది అస్సలు ఊహించలేదు!

సలార్‌ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ఒకరోజు ముందు షారుఖ్‌ ఖాన్‌ డంకీ మూవీ థియేటర్లలోకి వచ్చింది. సలార్‌ -డంకీకి మధ్య పోటీలో షారుఖ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

సలార్‌ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ఒకరోజు ముందు షారుఖ్‌ ఖాన్‌ డంకీ మూవీ థియేటర్లలోకి వచ్చింది. సలార్‌ -డంకీకి మధ్య పోటీలో షారుఖ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

Maratha Mandir: షారుఖ్‌ను భారీగా దెబ్బ తీసిన సలార్‌.. ఇది అస్సలు ఊహించలేదు!

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ సినిమాలకు దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు కల్ట్‌ క్లాసిక్‌లుగా నిలిచిపోయాయి. అలాంటి వాటిలో ‘దిల్‌ వాలే దుల్హేనియా లేజాయేంగే’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. షారుఖ్‌ – కాజోల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్‌ మూవీ 1995 అక్టోబర్‌ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో డబ్‌ అయి ఇక్కడ కూడా విజయం సాధించింది.

కొన్ని థియేటర్లలో సంవత్సరానికి పైగా ఆడింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ముంబైలోని ‘‘ మరాఠా మందిర్‌’’ అనే థియేటర్‌లో ఇప్పటికి కూడా సినిమా ఆడుతోంది. అంటే దాదాపుగా 28 ఏళ్లుగా ‘దిల్‌ వాలే దుల్హేనియా లేజాయేంగే’ షోలు వేస్తూ ఉన్నారు. ఏ రోజూ ఈ మూవీ షో వేయకుండా ఆపలేదు. అంతలా షారుఖ్‌ సినిమా ప్రభావం చూపింది. షారుఖ్‌కు సంబంధించి ఏ మూవీ వచ్చినా మొదటి ప్రధాన్యత ఆయనకే ఉంటోంది.

salar hits sharuk khan ego

తాజాగా షారుఖ్‌ ఖాన్‌- రాజ్‌ కుమార్‌ హిరానీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డంకీ ’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డంకీ రిలీజ్‌కు ముందు వరకు ఓ షో ‘ ‘దిల్‌ వాలే దుల్హేనియా లేజాయేంగే’ వేసి.. మిగిలిన షోలు ‘యానిమల్‌’ వేసే వారు. డంకీ రావటంతో యానిమల్‌ షోలు ఎత్తేశారు. డంకీ వేస్తూ వచ్చారు. అది కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే. ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్‌’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. హిందీ భాషలో కూడా రిలీజ్‌ అయింది.

salar hits sharuk khan ego

మరాఠా మందిర్‌ యజమాన్యం సలార్‌ విడుదల నేపథ్యంలో అత్యంత కీలక, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. డంకీ సినిమాను ఎత్తేసి సలార్‌ మూవీ వేస్తున్నారు. దీంతో షారుఖ్‌ సొంత గడ్డ మీద.. సొంత అడ్డాలో ఆయన ఈగోపై సలార్‌ దెబ్బ కొట్టినట్లు అయింది. ఇంతకు ముందుకు థియేటర్ల విషయంలో డంకీకి.. సలార్‌కు మధ్య పోటీ నడుస్తూ వచ్చింది. నార్త్‌లో పైరవీలు చేసి సలార్‌కు థియేటర్లు ఎక్కువ రాకుండా చేశారని, వాటిని డంకీకి వాడుకున్నారన్న టాక్‌ నడుస్తోంది.

 

ఇటువంటి సమయంలో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ సొంత అడ్డాలో ఎదురు దెబ్బ ఎదురైంది. షారుఖ్‌ను ఎంతో అభిమానించే ‘మరాఠా మందిర్‌’ యజమాన్యం డంకీ సినిమాను ఎత్తేసి సలార్‌ను వేసుకుంది. ఈ దెబ్బను షారుఖ్‌ ఖాన్‌ అస్సలు ఊహించి ఉండడు. మరి, ముంబైలోని మరాఠా మందిర్‌లో షారుఖ్‌ సినిమా ఎత్తేసి సలార్‌ సినిమా వేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి