iDreamPost

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు చెక్ పెట్టిన కరోనా…

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు చెక్ పెట్టిన కరోనా…

కరోనా వైరస్ పేరు వింటేనే కొన్ని దేశాలు వణికిపోతున్నాయి.. చైనాలో కొన్ని నగరాలను దిగ్భంధం చేసారు.. చైనాలో 908 మంది మృత్యువాత పడ్డారు.. ఇతర దేశాల్లో దాదాపు 300 కరోనా కేసులు నమోదయ్యాయి.

కాగా భారత్ లో కూడా కరోనా కేసులు నమోదవడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ లో కరోనా వైరస్ బాధితుల కోసం స్పెషల్ వార్డులు కేటాయించారు.. అనేకమంది తమకు వ్యాధి సోకిందేమో అన్న అనుమానంతో హాస్పిటల్ కు క్యూలు కట్టారు..

కరోనా వైరస్ అంటు వ్యాధి కావడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేశారు.. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బ్రీత్ ఎనలైజర్లు వాడొద్దని హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసు విభాగం హెడ్‌ రవికాంతేగౌడ ఆదేశించారు. బ్రీత్ ఎనలైజర్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్‌ పోలీసు విభాగం హెడ్‌ రవికాంతేగౌడ తెలిపారు. బ్రీత్ ఎనలైజర్ల ద్వారా తనిఖీలు నిర్వహించకుండా వైద్య పరీక్షల సాయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను చేయమని ట్రాఫిక్ పోలీసులకు రవికాంత్ గౌడ ఆదేశించారు. దీంతో కొన్ని రోజులపాటు బ్రీత్ ఎనలైజర్లతో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిలిచిపోనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి