iDreamPost

భారతీయ శాస్త్రవేత్త స్వాతికి బోర్లాగ్ అవార్డ్!

  • Published Sep 22, 2023 | 10:07 AMUpdated Sep 22, 2023 | 10:07 AM
  • Published Sep 22, 2023 | 10:07 AMUpdated Sep 22, 2023 | 10:07 AM
భారతీయ శాస్త్రవేత్త స్వాతికి బోర్లాగ్ అవార్డ్!

భారత దేశంలో ఇప్పుడు అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో దూసుకు పోతుంది. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనా రంగంలో భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన ఘనత గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్ – 3 ఘనవిజయం సాధించింది. తక్కువ ఖర్చుతో చంద్రయాన్ – 3 ని జాబిల్లిపైకి పంపించి అగ్ర రాజ్యాలను ఆశ్చర్యపరిచారు మన శాస్త్రవేత్తలు. తాజాగా భారతీయ శాస్త్రవేత్తకు అరుదైన అవార్డు దక్కింది. వివరాల్లోకి వెళితే..

భారతీయ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం దక్కింది.. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ) కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ కు 2023 సంవత్సరానికి గాను క్షేత్ర పరిశోధన, అన్వయాలకు ‘నార్మన్ బోర్లాగ్’ అవార్డు ప్రకటించారు. వరి పరిశోధనలో డాక్టర్ స్వాతి నాయక్ చేసిన విశేష కృషి చేశారని.. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలు ఎంతో గొప్పవని రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నిధిలతు నడిచే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రశంసించింది.

ఒడిశాకు చెందిన స్వాతి నాయక్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా స్వాతి నాయక్ వరి సాగు చేస్తున్న రైతులకు అందుబాటులో ఉంటూ.. వారికి తగు సూచనలు సలహాలు ఇస్తూ విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్నారు. ఇక హరిత విప్లవ పితామహుడు, నోబెల్ గ్రహీత అయిన నార్మన్ బ్లోగర్ పేరిట పేరుమీదుగా 1972 లో స్థాపించబడినది. ఆకలిని నిర్మూలించి ఆహార భద్రతకు తోడ్పడే నలభై ఏళ్ల లోపుయ యువ శాస్త్రవేత్తలకు ఈ అవార్డు ఇస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి