iDreamPost

ఫెమినా మిస్ ఇండియా పోటీలకు కడప డాక్టర్

ఫెమినా మిస్ ఇండియా పోటీలకు కడప డాక్టర్

సాధారణంగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అంటూ సినీరంగంలో స్థిరపడి పోయినవారు ప్రాస కోసం కొన్ని డైలాగులు చెబుతూ ఉంటారు. కానీ డాక్టర్ గా స్థిరపడిన ఒక యువతి ఇప్పుడు గ్లామర్ ఫీల్డ్ వైపు అడుగులు వేయడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా డాక్టర్ చదవడానికి వెళుతున్నారు అనగానే వారి జీవితం ఇక వైద్య వృత్తికి అంకితం అయిపోయింది, ఇక వాళ్ళు జీవితాంతం వైద్యం చేస్తూనే బతకాలి అనే ఆలోచనే అందరిలోనూ ఉంటుంది.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి మాత్రం ఒక పక్క డాక్టర్ వృత్తి చేపడుతూనే మరోపక్క అందాల పోటీల్లో పాల్గొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కడప జిల్లాకు చెందిన ఆమె పేరు డాక్టర్ అంబటి చందన.

పుట్టింది విద్యావంతుల కుటుంబంలో కావడంతో తన తండ్రి అంబటి శ్రీనివాసులరెడ్డి ఇంజనీర్ కావడం, తన తల్లి లక్ష్మీదేవి డాక్టర్ చదివి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా మారడం ఇవన్నీ చూసి కూడా చిన్నప్పటినుంచి తాను డాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా మనసులో ముద్రించుకుంది. అందుకు తగ్గట్టే కృషి చేస్తూ ఎట్టకేలకు అంబటి చందన కాస్తా డాక్టర్ అంబటి చందన అయింది. అయితే డాక్టర్ గా తన సేవలను మరింత విస్తృత పరచాలి అంటే దానికి ఏదో ఒక గుర్తింపు అవసరమని భావించిన ఆమె గ్లామర్ ఫీల్డ్ మీద కూడా తనకు ఉన్న ఆసక్తితో ఫెమినా మిస్ ఇండియా 2022 వైపు అడుగులు వేశారు.

తొలి ప్ర‌య‌త్నంలోనే ఆంధ్ర నుండి టాప్ 8 సెమీ ఫైనలిస్ట్ గా కూడా ఆమె ఎంపిక అయ్యారు. ఒక వైపు వైద్య వృత్తిని కొన‌సాగిస్తూ మ‌రో వైపు అందాల పోటీల‌కు సంసిద్ధం అవుతున్న ఆమె ఇప్పుడు పలువురికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. ప్ర‌తి రాష్ట్రం నుండి ఎంపికైన స్టేట్ పైన‌లిస్టుల‌తో ముంబై న‌గ‌రంలో ఆడిష‌న్స్ నిర్వహిస్తారు. అన్ని రాష్ట్ర‌ల నుండి పాల్గొంటున్న అంద‌మైన అమ్మాయిల నుండి ముప్పై ఒక మందిని ఎంపిక చేస్తారు. అక్కడ గనుక ఆమె ఫైనల్ అయితే ఇండియా పోటీ లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. అన్నట్లు ఇదే పోటీలకు సినీ హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ కూడా హాజరయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి