iDreamPost

OTT Suggestion: అమ్మాయిల పిచ్చోడు.. నరరూప రాక్షసుడు! OTT హిస్టరీలోనే క్రూరమైన సిరీస్!

  • Published Apr 25, 2024 | 7:58 PMUpdated Apr 25, 2024 | 7:58 PM

ఇప్పుడు హాలిడేస్ వచ్చేశాయి కాబట్టి.. ఎవరు చూసినా ఓటీటీ లో కొత్తగా ఏమి సినిమాలు వచ్చాయా.. ఏ సిరీస్ లు వచ్చాయా అని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు. కొత్తగా వచ్చేవి ఎలానో చూస్తూనే ఉంటారు. కానీ ఈ పాత సినిమాలను మిస్ చేస్తే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్లే.

ఇప్పుడు హాలిడేస్ వచ్చేశాయి కాబట్టి.. ఎవరు చూసినా ఓటీటీ లో కొత్తగా ఏమి సినిమాలు వచ్చాయా.. ఏ సిరీస్ లు వచ్చాయా అని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు. కొత్తగా వచ్చేవి ఎలానో చూస్తూనే ఉంటారు. కానీ ఈ పాత సినిమాలను మిస్ చేస్తే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్లే.

  • Published Apr 25, 2024 | 7:58 PMUpdated Apr 25, 2024 | 7:58 PM
OTT Suggestion: అమ్మాయిల పిచ్చోడు.. నరరూప రాక్షసుడు! OTT హిస్టరీలోనే క్రూరమైన సిరీస్!

సహజంగా మంచి సినిమాలను కానీ.. సిరీస్ లు కానీ చూడాలని అనుకున్నపుడు ముందు అందరూ.. దాని రేటింగ్ ను సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే.. కొన్ని సార్లు రేటింగ్ తక్కువ ఉన్న సినిమాలు కూడా.. కథ విషయంలో ప్రేక్షకులకు ఎక్కడ అన్యాయం చేయకుండా పూర్తి న్యాయం చేకూరుస్తూ ఉంటాయి. ఇక ఎలాగూ రేటింగ్ తక్కువ ఉంది కదా అని.. కొంతమంది ఆ సినిమాలను లైట్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి అలా మంచి కథలతో వచ్చిన అండర్ రేటెడ్ సినిమాలు, సిరీస్ లు చాలానే ఉన్నాయి. ఇప్పడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఇటువంటిదే. ఇప్పటివరకు ఈ సిరీస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఒక మంచి వర్త్ వాచింగ్ సిరీస్ ను మిస్ అయినట్లే. ఇంతకీ ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు “ఆటో శంకర్”. ఈ సిరీస్ ప్రస్తుతం జీ5 లో తెలుగులో అందుబాటులో ఉంది. మొత్తం పది ఎపిసోడ్స్ గా ఉన్న ఈ సిరీస్ చూస్తే.. దీనికి మించిన రియలిస్టిక్ సిరీస్ ఇంకోటి ఉండదేమో అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ సిరీస్ ఒక రియలిస్టిక్ స్టోరీ.. 1980 దశాబ్దంలో తమిళనాడు ప్రజలకు ‘ఆటో శంకర్‌’ అంటే హడల్‌. అతను ఆటో డ్రైవర్‌, దొంగ సారా ఏజెంట్‌, సీరియల్‌ కిల్లర్‌, అమ్మాయిలను సప్లై చేసేబ్రోకర్ ఇలా అనేక రకాలుగా పిలిచేవారు. అప్పట్లో ఆటో శంకర్‌’ పేరు వింటేనే ప్రజల భయంతో వణికి పోయేవారు. 1988 లో ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన అస్థిపంజరాలకు ఆటో శంకర్ కు ఉన్న సంబంధం ఏమిటి! దీంతో అసలు ఎవరీ శంకర్.. ఎందుకు నేరస్థుడిగా మారాడు.. అన్న సందేహాలు అందరి మదిలో మెదిలాయి. అతడి కోసం ఎన్నో నెలల పాటు దేశమంతా గాలించిన తమిళనాడు పోలీసులు.. ఎట్టకేలకు ఒడిశాలోని రూర్కెలా స్టీల్ ఫ్యాక్టరీ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత ఏం జరిగింది ! శంకర్ అమ్మాయిలను ఎలా లొంగతీసుకునే వాడు.. ప్రజలు ఇతని వలన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేవి అన్ని కూడా ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ప్రతి క్యారక్టర్ ను కూడా చాలా రియలిస్టిక్ గా చూపించారు. ప్రతి ఎపిసోడ్ లోను అడల్ట్ సీన్స్, క్రైమ్ సీన్స్ ను ఎంతో బాగా తెరకెక్కించారు. గుండె దైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సిరీస్ ను చూస్తే బెటర్. ఎందుకంటే ప్రతి సీన్ ను కూడా అంతా రియల్ గా చూపించారు. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయ్యి ఉంటె మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి