iDreamPost

OTT Movie: ఓ పోలీస్ చావు చుట్టూ థ్రిల్లింగ్ మూవీ! OTTలోని టాప్ మూవీల్లో ఇది ఒకటి!

  • Published Apr 18, 2024 | 7:13 PMUpdated Apr 26, 2024 | 6:22 PM

ఓటీటీ ల ట్రెండ్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చేస్తూ ఉన్నాయి. అయితే చాలామంది వాటిలో కొన్ని మిస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మీరు మిస్ చేశారేమో చూసేయండి.

ఓటీటీ ల ట్రెండ్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చేస్తూ ఉన్నాయి. అయితే చాలామంది వాటిలో కొన్ని మిస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మీరు మిస్ చేశారేమో చూసేయండి.

  • Published Apr 18, 2024 | 7:13 PMUpdated Apr 26, 2024 | 6:22 PM
OTT Movie: ఓ పోలీస్ చావు చుట్టూ థ్రిల్లింగ్ మూవీ! OTTలోని టాప్ మూవీల్లో ఇది ఒకటి!

వారానికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవుతుంటే అవి అందరికి గుర్తుండిపోతాయి. కానీ, ఓటీటీ లకు బాగా పెరుగుతున్న క్రేజ్ లో వారానికి డజన్లలో కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. పైగా కొన్ని సినిమాలైతే సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీనితో చాలా మంది కొన్ని సినిమాలను మిస్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కూడా మీరు మిస్ చేసిన లిస్ట్ లో ఉన్నట్లయితే.. వెంటనే ఈ సినిమా చూడాలసిందే. ఒక వర్త్ వాచింగ్ సినిమాను మిస్ చేశామా అని ఫీల్ అవ్వడం పక్కా. ఇంతకీ ఆ సినిమా పేరేంటంటే “ఇరట్టా”. ఈ సినిమా కథేంటో ఎందుకు వర్త్ వాచింగ్ .. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే వివరాలను చూసేద్దాం.

ఇరట్టా సినిమా మలయాళ భాషకు చెందిన సినిమా. ఇక మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా అట్ట్రాక్ట్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాము. నిన్న మొన్నటి వరకు డబ్బింగ్ చేసిన మలయాళ సినిమాలు.. థియేటర్స్ ను ఒక ఊపు ఊపేసాయి. ఈ క్రమంలోనే ఓటీటీ లలోను మలయాళ సినిమాల కోసం సెర్చ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పుడు ఆ మలయాళ సినిమాలు ముందుగా మాతృభాషలో విడుదలైనా కానీ.. ఆ తరువాత తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో “ఇరట్టా” అనే సినిమా.. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ లో.. ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దానికి మెయిన్ గెస్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి అటెండ్ అవుతారు. దీనితో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. మీడియా కూడా అంతా కవర్ చేయడం మొదలు పెడతారు. ఇంతలో సడెన్ గా అక్కడ మూడు రౌండ్ల తుపాకీ కాల్పులు జరుగుతాయి.

ఒక్కసారిగా పోలీసులంతా అలర్ట్ అవుతారు. ఆ కాల్పులలో ఆ స్టేషన్ ఎస్ఐ చనిపోతాడు. అసలు సరిగ్గా ముఖ్య మంత్రి వచ్చినపుడే.. ఈ కాల్పులు ఎందుకు జరిగాయి ! ఆ స్టేషన్ ఎస్ఐ హత్య చేయబడ్డాడా లేదా ఆ కాల్పులలో మరణించాడా ! ఈ కాల్పుల వెనుక దాగి ఉన్న అసలు కారణాలేంటి ! చివరికి ఈ కేస్ ను పోలీసులు ఎలా సాల్వ్ చేశారు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను మిస్ చేసినట్లే. ఇన్వెస్టిగేషన్ తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది . సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి