iDreamPost

OTT Movies: OTT లో ఉన్న బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీస్.. వీటిని అసలు మిస్ కాకండి!

  • Published Apr 24, 2024 | 2:40 PMUpdated Apr 26, 2024 | 6:18 PM

సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి. ఇక బోర్ కొట్టకుండ ఉండేందుకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో బోలెడు సినిమాలు రెడీ గా ఉన్నాయి. కొత్తగా వచ్చే సినిమాలను ఎలాగూ చూస్తూనే ఉంటారు. ఇంకా టైమ్ చాలా మిగిలి ఉంటుంది కాబట్టి.. ఓటీటీ లో అందుబాటులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ని అసలు మిస్ కాకండి.

సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి. ఇక బోర్ కొట్టకుండ ఉండేందుకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో బోలెడు సినిమాలు రెడీ గా ఉన్నాయి. కొత్తగా వచ్చే సినిమాలను ఎలాగూ చూస్తూనే ఉంటారు. ఇంకా టైమ్ చాలా మిగిలి ఉంటుంది కాబట్టి.. ఓటీటీ లో అందుబాటులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ని అసలు మిస్ కాకండి.

  • Published Apr 24, 2024 | 2:40 PMUpdated Apr 26, 2024 | 6:18 PM
OTT Movies: OTT లో ఉన్న బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీస్.. వీటిని అసలు మిస్ కాకండి!

సినిమాలంటే లవ్, రొమాన్స్, యాక్షన్, హర్రర్, సస్పెన్స్ ఇవే కాదు ఇంకా చాలా రకాల జోనర్స్ ఉన్నాయి. వాటిలో సైన్స్ ఫిక్షన్ తరహా మూవీస్ కూడా ఒకటి. ఇప్పుడు లేటెస్ట్ గా ఓటీటీ లోకి ప్రతి వారం ఏ సినిమాలు వస్తున్నాయి.. ఎక్కడ వస్తున్నాయి ఎప్పటికప్పుడు ఈ లిస్ట్ వస్తూనే ఉంది. దీనితో ప్రేక్షకులకు కూడా ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఈ సినిమాలను చూసేస్తున్నారు. ఎలాగూ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, అందులోను బయట ఎండలు మండిపోతున్నాయి.. బయటకు వెళ్లే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి, ఎంచక్కా ఇంట్లో హాయిగా రిలాక్స్ అవుతూ ఓటీటీ లో ఉండే ఈ సినిమాలను చూసేయండి. కొత్తగా వచ్చే సినిమాలను ఎలానూ చూస్తూనే ఉంటారు. అవి పక్కనపెడితే.. ఓటీటీ లో సైన్స్ ఫిక్షన్ తరహాలో తెరకెక్కిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే సైన్స్ ఫిక్షన్ తరహా మూవీస్ లిస్ట్ ఇదే.. వీటిలో తెలుగుతో పాటు మరెన్నో భాషల చిత్రాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలు చూసేద్దాం.

1) అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ : ప్రైమ్ వీడియో
ఈ సినిమా తెలుగులోనే వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. ఈ సినిమాలో వరుణ్ తేజ్, అదితి రావ్, లావణ్య త్రిపాఠీ ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ సినిమాలో దాదాపు అంతా కూడా స్పేస్ రిలేటెడ్ స్టోరీనే ఉంటుంది. ఈ సినిమాను పూర్తిగా ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే మాత్రం ఒక మంచి మూవీని మిస్ అయినట్లే. సో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమాను వెంటనే చూసేయండి.

2) ఒకే ఒక జీవితం : సోనీలివ్
శర్వానంద్ నటించిన ఈ సినిమాలో .. అమల ప్రత్యేకమైన పాత్ర పోషించారు. టైమ్ ట్రావెల్ కథనంతో వచ్చిన ఈ సినిమాలో పారలెల్ లైఫ్స్ ను ఒకేసారి చూపించినట్లుగా .. ఎక్కడ గందరగోళం లేకుండా అద్భుతంగా చూపించారు. దాదాపు అందరు ఈ సినిమాను చూసి ఉంటారు. కానీ, మళ్ళీ చూసిన కూడా ఎక్కడ బోర్ కొట్టించని మూవీ ఇది. ప్రస్తుతం సోనీలివ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

3) యశోద : ప్రైమ్ వీడియో
ఈ సినిమా ప్రస్తుతం చాలా మంది ఆడవారికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని చెప్పి తీరాలి. సరోగసి చుట్టూ తిరిగే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ లో నటించారు. ఈ సినిమాలు హైలెట్ అంతా క్లయిమాక్స్ అని చెప్పి తీరాలి. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

4) 2.0 :జియో సినిమా
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. దీని తర్వాత సెకండ్ పార్ట్ గా 2.0 ను తెరకెక్కించారు. అడపా దడపా ఈ సినిమా టీవీ లలో వస్తూనే ఉంటుంది .కానీ, ఇప్పటికిప్పుడు ఈ సినిమాను చూడాలంటే మాత్రం జియో సినిమాలో అందుబాటులో ఉంది.

ఇక బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ లిస్ట్ విషయానికొస్తే.. బాలీవుడ్ సినిమాలన్నీ కూడా మరో ప్రపంచానికి తీసుకువెళ్తాయని చెప్పి తీరాలి. ఇక ఓటీటీ లో అందుబాటులో ఉండే బెస్ట్ బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే

1) ఇంటర్ స్టెల్లార్ : ప్రైమ్ వీడియో
2) ది మ్యాట్రిక్స్ : నెట్‌ఫ్లిక్స్
3) జురాసిక్ పార్క్ : నెట్‌ఫ్లిక్స్
4) హర్: ప్రైమ్ వీడియో
5) అవతార్ : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
6) బ్లేడ్ రన్నర్ 2049 : ప్రైమ్ వీడియో
7) ది మార్షన్ : హాట్‌స్టార్
8) ఇన్సెప్షన్ :ప్రైమ్ వీడియో
9) ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ : నెట్‌ఫ్లిక్స్
10) అరైవల్ : ప్రైమ్ వీడియో
11) గ్రావిటీ : ప్రైమ్ వీడియో
12) ఎ క్వైట్ ప్లేస్ : ప్రైమ్ వీడియో
13) ది టర్మినేటర్ : ప్రైమ్ వీడియో

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి