iDreamPost

మీరు మాత్రం ఇలా చేయకండి.. తాగుతూ నిర్లక్ష్యంగా బండి నడుపుతున్న యువకులు.. వైరల్ గా మారిన వీడియో..

మీరు మాత్రం ఇలా చేయకండి.. తాగుతూ నిర్లక్ష్యంగా బండి నడుపుతున్న యువకులు.. వైరల్ గా మారిన వీడియో..

ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా కొంతమంది రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మరి కొంతమంది ఇలాంటివి వీడియోలు కూడా తీస్తారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియో అలాగే ఉంది. ఒక పక్క పోలీసులు తాగి డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు అని చెప్తూనే ఉన్నారు, మరో పక్క అలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఈ వీడియోలో ఉన్న వాళ్ళు మాత్రం మేం ఇలాగే చేస్తాం అంటున్నారు.

ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోలేదు, అంతే కాకుండా ఇద్దరూ గ్లాస్ లో ఆల్కాహాల్ పోసుకొని అది తాగుతూ డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవ్ చేసే వ్యక్తి, వెనక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ ఆల్కహాల్ తాగుతూ వెళ్తున్నారు. దీంతో తూలుతూ బైక్ నడుపుతూ కింద పడ్డారు. అయితే ఇది ఫన్నీ బైక్ ఆక్సిడెంట్ అని యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఇది వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన వారంతా దీనిని ఖండిస్తున్నారు. ఇలాంటి వాటితో జనాలకి ఏం చెప్దామని, మీరు ఇలా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ లో మరణిస్తే మీ ఇంట్లో వాళ్ళు బాధపడరా అని కామెంట్స్ చేస్తున్నారు వీడియో చుసిన వాళ్ళు. మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి. కచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపండి. ఆల్కహాల్ డ్రింక్ చేసి అస్సలు నడపద్దు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి