iDreamPost

విచారణార్హత మిగిలిందా..లోకేష్?

విచారణార్హత మిగిలిందా..లోకేష్?

యేడాది పాలనలో సీయం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పులపై ఛార్జిషీట్‌ విడుదల చేసారు టీడీపీ యువరాజు నారా లోక్‌ష్‌. విచారణార్హతగల ఒక అధికారి ఎవరైనా నిందితుడు చేసిన నేరంపై విచారణ చేసి లిఖితపూర్వకంగా నమోదు చేసేపత్రాన్నే చట్టపరంగా ఛార్జిషీట్‌ అంటారు.

ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే విచారణ చేసే అర్హత లోకేష్‌కు ఉందా? అన్నది మొదటి ప్రశ్న. ఇన్‌స్టెంట్‌ఫుడ్‌కుమల్లే దిగుమతైన లోకేష్‌ ఈ పనిచేయడంతోనే డొల్లతనం బైటపడింది. ఘనత వహించిన చినబాబు అధికారంలో ఉన్నప్పుడే సోషల్‌ మీడియా ఊరుకోలేదు. సొంత పార్టీ నేతలు బైటకు చెప్పుకోలేకపోయిన ఈయన వ్యవహరశైలిని ఏకిపారేసి వారికి మనశ్శాంతిని కలిగించిన విషయం ఇంకా జనం మర్చిపోలేదు.

ఇక పెదబాబుగారి పాలన గురించైతే మరీను.. హామీకొక్కటి చొప్పున కథలు, కథనాలు అచ్చేసుకొచ్చేసాయి. వీటికంటే ముందే ప్రజలు కూడా తమ మనోఫలకాలపై నిర్ణయం తీసుకుని ప్రజాఛార్జిషీట్‌ దాఖలు చేయడంతో 23వ నెంబరు కేటాయించడం జరిగిపోయింది. ఇదంతా యేడాదికే జనం మర్చిపోయుంటారన్న భావన కావొచ్చు, తామేం చెప్పినా బాజా కొట్టే సొంత మీడియా ఉందనుకునే ధీమాతోనే అయ్యుండొచ్చు ఛార్జిషీట్‌ను డాబుసరిగా జారీ చేసేసారు.

ఎదుటివారి లోపాల్ని, తప్పుల్ని ఎత్తి చూపాలంటే తగిన అర్హత ఉండాలి లేకపోతే ఈ ‘ఎత్తిచూపే’ చర్యలు తేలిపోతుంటాయి. పరపతి కోల్పోయిన రైతుల మనోవేదన, పుస్తెలను బ్యాంకులకే వదిలేయాల్సొచ్చి ఆడపడుచుల కన్నీళ్ళు, నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూసి నిరాశపడ్డ యువకుల ఇబ్బందులు, సహజ వనరుల ప్రత్యక్ష పచ్చ దోపిడీ.. ఇలా చెప్పుకుంటూ పోతే అసలెన్ని ఛార్జిషిట్లు దాఖలు చేయాలో మరి.

ఏం చెబుతున్నా, ఏం ఆరోపిస్తున్నా.. మరింకోటి చేస్తున్నా గానీ జనంలో స్పందన కన్పించడం లేదన్న విషయాన్ని కూడా మంద బుద్దులు గుర్తించలేరు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని అసలు విచారణ చేసే అర్హత మనకుందా అని ఆత్మవిమర్శ చేసుకోండన్న సూచన ప్రజల నుంచి స్పష్టంగానే విన్పిస్తోంది. అయినా గానీ మేమింతే అంటారా.. కంటిన్యూ.. సంక్షేమ పాలన ఎంజాయ్‌ చేస్తున్న ప్రజలకు ఇదో కాలక్షేపం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి