iDreamPost

పాము కాటు వేస్తే ప్రాణం పోతుంది.. మరి విషం తాగితే ఏమవుతుందో తెలుసా?

  • Author Soma Sekhar Published - 12:43 PM, Thu - 23 November 23

పాము కటు వేస్తే ప్రాణం పోతుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ పాము విషాన్ని మంచినీళ్లు తాగినట్లు తాగితే ఏమవుతుంది? అన్న ప్రశ్నకు నిపుణులు ఏం సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

పాము కటు వేస్తే ప్రాణం పోతుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ పాము విషాన్ని మంచినీళ్లు తాగినట్లు తాగితే ఏమవుతుంది? అన్న ప్రశ్నకు నిపుణులు ఏం సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 12:43 PM, Thu - 23 November 23
పాము కాటు వేస్తే ప్రాణం పోతుంది.. మరి విషం తాగితే ఏమవుతుందో తెలుసా?

ఈ ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని చాలా మంది ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అలాంటి ప్రశ్నల్లో ఒకదాని గురించే ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. అదేంటంటే? సాధారణంగా పాము కాటుకు గురై, సమయానికి వైద్యం అందక మనుషులు మరణించిన సంఘటనలను మనం ఎన్నో చూశాం.. విన్నాం కూడా. అయితే పాము కటు వేస్తే ప్రాణం పోతుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ పాము విషాన్ని మంచినీళ్లు తాగినట్లు తాగితే ఏమవుతుంది? అన్న సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇక ఈ ప్రశ్న గురించి ఇంటర్నెట్ లో వెతకడం మెుదలు పెట్టారు కొందరు నెటిజన్లు. మరి పాము విషయం తాగితే ఏమవుతుంది అన్న ప్రశ్నకు నిపుణులు ఏం సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. వరల్డ్ వైడ్ గా సుమారు 3,500 రకాల పాములు ఉన్నాయి. అయితే అందులో 25 శాతం మాత్రమే విషపూరితమైనవని చెబుతూ ఉంటారు ఆ రంగానికి చెందిన నిపుణులు. ఇక కింగ్ కోబ్రా విషం ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనదని జనాలు నమ్ముతూ ఉంటారు. పాము కాటు వేసినప్పుడు తన గ్రంథుల ద్వారా విషాన్ని రక్తప్రవాహంలోకి పంపుతుంది. దీంతో ఈ విషం రక్తంలో కలిసి.. బాడీలోని సెల్యూలార్ చలన శీలతను విచ్చిన్నం చేస్తుంది. దీంతో మనిషికి వెంటనే పక్షవాతం, అంతర్గత రక్తస్రావం జరిగి మరణానికి దారితీస్తుంది. ఇవన్నీ కాసేపు పక్కనపెడితే.. పాము విషాన్ని మంచినీళ్లలా తాగితే ఏమవుతుంది? అన్న సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. మరికొందరికి అస్సలు వచ్చి ఉండదు.

అయితే ఈ ప్రశ్న తలెత్తడానికి ప్రధాన కారణం.. ఇటీవలే బాగా వినిపించిన ఓ వార్త. అదేంటంటే? సెలబ్రిటీలు పాము విషాన్ని డ్రగ్ గా వాడుతున్నారని. ఇక ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారంటే? పాము కాటు ప్రాణాంతకం.. కానీ పాము విషం తాగితే దాని పరిణామాలు భిన్నంగా ఉంటాయని చెబుతున్నారు. పాము విషయం ప్రోటీన్ ఆధారిత టాక్సిన్ అని, ఇది కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్ ల సాయంతో జీర్ణం అవుతుందని కొందరి వాదన. పాము విషం రక్తంలోకి చేరిన తర్వాత అది ధమనుల్లోకి వెళ్లి.. రక్తాన్ని గడ్డకట్టించడం ప్రారంభిస్తుంది. ఇది జీర్ణక్రియకు ఎంత మాత్రం సహకరించదని మరికొందరు నిపుణులు తమ అభిప్రాయాలను తెలియపరిచారు. ఏది ఏమైనప్పటికీ పాము కాటు వేసినా.. పాము విషం తాగినా ప్రమాదం అనే విషయం గుర్తుంచుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి