iDreamPost

డాక్టర్, జైలర్ మూవీస్ లోని ఈ నటుడు.. ఒకప్పటి స్టార్ తెలుగు డైరెక్టర్ కొడుకు తెలుసా?

  • Author ajaykrishna Published - 04:30 PM, Fri - 18 August 23
  • Author ajaykrishna Published - 04:30 PM, Fri - 18 August 23
డాక్టర్, జైలర్ మూవీస్ లోని ఈ నటుడు.. ఒకప్పటి స్టార్ తెలుగు డైరెక్టర్ కొడుకు తెలుసా?

ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది నటీనటులను ఇట్టే గుర్తుపడతాం. వాళ్లు స్టార్ హీరోల ఫ్యామిలీ నుండి వచ్చినా.. హీరోయిన్స్ తరపున వచ్చినా లేదా నిర్మాతలు, దర్శకులు.. ఇలా ఎవరి ఫ్యామిలీ నుండి వచ్చినా దాదాపు అందరికీ ఏదో రకంగా తెలిసిపోతుంది. కానీ.. కొంతమందిని మాత్రం గుర్తు పట్టడానికి చాలా టైమ్ పడుతుంది. ఒక్కోసారి ఏళ్లు కూడా గడిచిపోవచ్చు. ప్రస్తుతం ఓ పాపులర్ యాక్టర్ విషయంలో అదే జరిగిందని అంటున్నారు సినీ ప్రేక్షకులు. అందులోనూ ఓ తెలుగు సీనియర్ డైరెక్టర్ కి కొడుకు అయినప్పటికీ.. డబ్బింగ్ సినిమాలతో ఆల్రెడీ తెలుగువారికి పరిచయం అయినా ఇన్నేళ్లు గుర్తుపట్టలేకపోయారు. అతనెవరో కాదు.. సునీల్ రెడ్డి.

ఈ పేరుతో గుర్తు పట్టకపోవచ్చు. శివకార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాలో మహాలి అంటే.. లేదా రజినీకాంత్ లేటెస్ట్ జైలర్ మూవీలో డైరెక్టర్ బాగున్నారా బాలు.. క్యారెక్టర్స్ లో నటించిన వ్యక్తిగా గుర్తుపట్టగలరు. ఇంతకీ ఈ బాగున్నారా బాలు.. రియల్ లైఫ్ లో ఎవరో తెలుసా? టాలీవుడ్ లో వందకు పైగా సినిమాలు డైరెక్ట్ చేసిన ఏ. కోదండరామిరెడ్డి పెద్ద కుమారుడు. అవును.. వింటే నమ్మబుద్ది కావడం లేదు కదా! అంత పెద్ద డైరెక్టర్ కొడుకు అయ్యుండి కూడా ఇలా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు ఎందుకని మీకు సందేహం రావచ్చు. సునీల్ రెడ్డి స్వయానా.. హీరో వైభవ్ రెడ్డికి అన్నయ్య. సునీల్ రెడ్డి నటుడిగా చాలా సినిమాలు చేశారు.

ఇప్పటిదాకా దాదాపు కామెడీతో కూడిన పాత్రలు ఎక్కువగా చేశారు. అయితే.. డాక్టర్ మూవీలో మహాలి పాత్రతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు జైలర్ మూవీలో.. బాగున్నారా బాలుగా ట్రెండ్ అవుతున్నారు. మరి మున్ముందు తెలుగులో సినిమాలు చేస్తారేమో చూడాలి. సునీల్ రెడ్డికి మంచి పేరు తెచ్చిన డాక్టర్, జైలర్ రెండు సినిమాలు కూడా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. మరి ఓ రకంగా సునీల్ రెడ్డి పేరు జనాల్లోకి వెళ్లడానికి డైరెక్టర్ నెల్సన్ కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా.. సునీల్ రెడ్డి తమ్ముడు వైభవ్ రెడ్డి.. తెలుగులో గొడవ సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. కానీ.. ఆ సినిమా పెద్దగా క్లిక్ అవ్వకపోయే సరికి తమిళంవైపు వెళ్ళిపోయాడు. మరి సునీల్ రెడ్డి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి