iDreamPost

ఏ సముద్రంలో కలవకుండా.. ఒక్కసారిగా మాయమైపోయే నది ఏదో తెలుసా..?

భారత్ అనేక నదుల కలయిక. నదులు, వాటి ఉప నదులు దేశంలో సుమారు 400 వందలకు పైనే ఉన్నాయి. అయితే ఏ నది అయినా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుని చివరకు సముద్రంలో కలిపిపోవాల్సిందే. కానీ ఆ నది మాత్రం కలవదు.

భారత్ అనేక నదుల కలయిక. నదులు, వాటి ఉప నదులు దేశంలో సుమారు 400 వందలకు పైనే ఉన్నాయి. అయితే ఏ నది అయినా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుని చివరకు సముద్రంలో కలిపిపోవాల్సిందే. కానీ ఆ నది మాత్రం కలవదు.

ఏ సముద్రంలో కలవకుండా.. ఒక్కసారిగా మాయమైపోయే నది ఏదో తెలుసా..?

జీవి పుట్టుకకు కారణం నీరు. మనిషికి జీవానాధారం జలం, భూమి మీద వృక్ష, జంతు జాతులకు మనుగడ నీటితోనే సాధ్యం. ఉదకం లేకపోవడంతో జీవ కోటి లేనే లేదు. ఘన, ద్రవ, వాయు రూపంలో నీరు లభిస్తుంది. నదులు, చెరువులు, తటాకాలు, సరస్సుల రూపంలో నీరు సమస్త జీవాలకు అందుతుంది. దేశం అనేక నదుల సముదాయం. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తపతి, నర్మద, బ్రహ్మపుత్ర వంటి నదులు, వాటి ఉప నదులు దేశ వ్యాప్తంగా ప్రవహిస్తూ మనుషుల దాహాన్ని తీర్చడంతో వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. పంటలకు సమృద్దిగా నీరు లభించడం వల్ల గ్రామాలు కళకళలాడుతున్నాయి. అయితే ప్రతి నదీ కూడా సముద్రంలో కలవాల్సిందే. కానీ ఆ నది మాత్రం కలవదు.

సాధారణంగా నది కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుని, పలు ప్రాంతాలను కలుపుకుపోతూ, పంటలను సశ్యశ్యామలం చేస్తూ చివరకు సముద్రం పాలవుతుంది. చివరికీ ఆ నీరు ఉప్పగా మారిపోతుంది. కానీ ఆ నది మాత్రం తాను కలవనంటోంది. ఇంతకు ఆ నది ఏంటంటే..లూని నది. ఇది భారత దేశంలోనే ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న లూని నది.. ఏ సముద్రంలో కలవకుండా ఉండిపోతుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? దీని వెనుక ఓ స్టోరీ ఉంది. ఆరావళి శ్రేణిలోని నాగ్ కొండపై 772 మీటర్ల ఎత్తులో ఈ నది ఉద్భవించింది. రాజస్థాన్ లోని అజ్మీర్ నుండి ప్రవహించే ఈ నది.. 495 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. గుజరాత్‌కు నేరుగా చేరుకునే ఏకైక నది ఇదే కావడం గమనార్హం.

నాగౌర్, జోధ్ పూర్, పాలి, బార్మెర్ జలౌర్ మీదుగా గుజరాత్‌లోని కచ్ వద్దకు చేరుకుంటుంది. ఇక అక్కడితో ఆగిపోతుంది.. సముద్రంలో కలువదు. కారణం అది ప్రవహించే ప్రాంతం అంతా వేడి వాతావరణం ఉంటుంది. నీరు తర్వగా ఆవిరి అయిపోయి.. అదృశ్యం అయిపోతుంది. థార్ ఎడారికి చేరుకున్న తర్వాత, లూని నది కచ్ ఎడారిలో కలిసిపోతుంది. ఇందులో మరో విశేషమేమిటంటే.. అజ్మీర్ నుండి బార్మెర్ వరకు నీరు తీపిగా ఉంటే.. అక్కడి నుండి ఉప్పగా మారిపోతుంది. దీనికి కారణం.. రాజస్తాన్ గుండా ప్రవహించేటప్పుడు ఎడారి నుండి వచ్చే ఉప్పు కణాలు నీటిలో కలిసిపోతాయి. గుజరాత్‌లోని కచ్‌కు చేరుకున్నాక పూర్తిగా ఆ నది అంతర్దానం అయిపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి