iDreamPost

1000 కోట్లు నష్టాన్ని మిగిల్చిన ఈ మూవీ గురించి తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో గెలుపు ఓటములు కామన్. ఓ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. మంచి సినిమా కూడా ఒక్కొక్కసారి వీక్షకులు ప్లాప్ చేసిన దాఖలాలున్నాయి. అయితే మహా అయితే నష్టం కొంత మేర ఉంటుంది. ఈ చిత్రం మాత్రం.. వెయ్యి కోట్లు నష్టాన్ని మిగిల్చింది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో గెలుపు ఓటములు కామన్. ఓ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. మంచి సినిమా కూడా ఒక్కొక్కసారి వీక్షకులు ప్లాప్ చేసిన దాఖలాలున్నాయి. అయితే మహా అయితే నష్టం కొంత మేర ఉంటుంది. ఈ చిత్రం మాత్రం.. వెయ్యి కోట్లు నష్టాన్ని మిగిల్చింది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే..?

1000 కోట్లు నష్టాన్ని మిగిల్చిన ఈ మూవీ గురించి తెలుసా..?

తాము తీసే ప్రతి సినిమా హిట్ కొట్టాలనే భావిస్తుంటారు దర్శక నిర్మాతలు. అలా అనుకుని మూవీస్ తీస్తుంటారు. పిక్చర్ హిట్టా, ఫట్టా అని నిర్ణయించేది ప్రేక్షకులు. వారి చేతుల్లోనే నిర్ణయాధికారం ఉంటుంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా చూడకుండా.. మూవీ నచ్చితే మంచి రివ్యూస్ ఇస్తుంటారు మూవీ లవర్స్. కోట్లు పెట్టి తీసిన సినిమా నచ్చలేదంటే.. ఒక్క షోతోనే ఇంటికి పంపించేసిన దాఖలాలున్నాయి. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా గెలుపు, ఓటములు కామన్. కానీ ఈ ఇండస్ట్రీ ఓ పెద్ద వలయం. మూవీ ఓ చైన్ బేస్ చేసుకుని ఉంటుంది. సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ లాభ పడినట్టే.. నష్టం వచ్చినప్పుడు.. వీరూ కూడా లాస్ కావాల్సిందే.

ఓ సినిమా మహా అయితే వంద కోట్లు, లేదా రెండు నుండి మూడొందల కోట్లు నష్టపోవడం గురించి విని ఉంటారు. కానీ ఇప్పుడు మనం ప్రస్తావించబోయే చిత్రం మాత్రం వెయ్యి కోట్లు నష్టం వచ్చింది. ఇంతకు ఆ మూవీ జాన్ కార్టర్. 2012లో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్సన్ యాక్షన్-అడ్వెంచర్ మూవీ . హాలీవుడ్ చిత్రాలకు పెట్టింది పేరైనా వాల్ డిస్నీ స్టూడియో నిర్మాణ సంస్థ దీన్నితెరకెక్కించింది. 2009లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.  30. 6 కోట్ల డాలర్ల (సుమారు రూ. 2 వేల కోట్లు)తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ మూవీలో టేలర్ కిట్స్, లిన్ కొలిన్స్, సమంతా మోర్టాన్, మార్క్ స్ట్రాంగ్, సియరన్ హిండ్స్, జేమ్స్ బ్రియాన్ వంటి స్టార్లు నటించారు. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది.

కానీ బాక్సాఫీసు వద్ద అతిపెద్ద డిజాస్టర్ చిత్రంగా మిగిలిపోయింది. పేలవమైన వీఎఫ్ఎక్స్, భారీ అంచనాలు, పూర్ ప్రమోషన్స్ వెరసి బోల్తా కొట్టేలా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 28.4 కోట్ల డాలర్ల్ గ్రాస్ కలెక్షన్లనే రాబట్టుకుంది. మొత్తంగా జాన్ కార్టర్ 20 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ. వెయ్యి కోట్లు నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌తో వాల్ డిస్నీ స్టూడియోకి కూడా భారీగా నష్టాలు వచ్చాయి. ఈ కారణంగా అప్పటి హెడ్ రిచ్ రోస్ రాజీనామా చేశాడు. ఈ సినిమా ప్లాప్ తో నాలుగేళ్ల పాటు దర్శకత్వం చేయలేదు డైరెక్టర్ ఆండ్రూ స్టాంటన్. ఫీమేల్ లీడ్ లిన్ కొలిన్స్ చాలా కాలం ఆఫర్లు లేక ఇబ్బంది పడింది. అతిపెద్ద బాక్సాఫీసు బాంబుగా నిలిచింది జాన్ కార్టర్ మూవీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి