iDreamPost

డీజే టిల్లు 2కి పరేషానా..? ప్లాన్స్ అన్ని మార్చుతున్నాడా?

  • Author ajaykrishna Updated - 03:14 PM, Thu - 31 August 23
  • Author ajaykrishna Updated - 03:14 PM, Thu - 31 August 23
డీజే టిల్లు 2కి పరేషానా..? ప్లాన్స్ అన్ని మార్చుతున్నాడా?

గతేడాది ‘డీజే టిల్లు’ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ ఒక్క సినిమాతో ఒక్కసారిగా హీరోగానే కాకుండా రైటర్ గా కూడా సక్సెస్ అయిపోయాడు. ఇంకేముంది.. టిల్లు సక్సెస్ ఊపులో టిల్లు సీక్వెల్ అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడు. ఫస్ట్ ఉన్న డైరెక్టర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకునే సరికి.. ఆ ప్లేస్ లో వేరే డైరెక్టర్ ని తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ పార్ట్ లో ఉన్న రాధికా అక్క.. అలియాస్ నేహా శెట్టి స్థానంలో.. ఈసారి అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చింది. అరే.. టిల్లు అంటే రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ తో పాటు ఘాటు రొమాన్స్ కూడా ఉంటుంది.

అలాంటి టిల్లుని హ్యాండిల్ చేసే క్యారెక్టర్ లో అనుపమ అనేసరికి అందరు ఆశ్చర్యపోయారు. హోమ్లీ బ్యూటీ కాస్త గ్లామర్ బ్యూటీగా మారబోతుందని పోస్టర్స్ తో పాటు టీజర్, టైటిల్ సాంగ్ వచ్చినప్పుడే అర్థమైపోయింది. దీంతో సరే అనుపమని గ్లామర్ గా చూడబోతున్నాం అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమా ఎక్కడికి సెప్టెంబర్ సెకండ్ వీక్ లో వస్తుందని అనౌన్స్ చేశారు. కానీ.. ఏమైందో గానీ మళ్లీ అక్టోబర్ కి వాయిదా వేశారు. టిల్లు కంటే బెటర్ గా.. కాస్త రిచ్ గా టిల్లు సీక్వెల్ ని నిర్మిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ వారు. ఇంతలో టిల్లు స్క్వేర్ కి సంబంధించి ఓ న్యూస్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. టిల్లు 2 అవుట్ ఫుట్ పై హీరో సిద్ధు జొన్నలగడ్డ అసంతృప్తిగా ఉన్నాడని ఆ వార్తల సారాంశం.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటిదాకా షూటింగ్ సీన్స్ చూశాక సిద్ధు కొన్ని చోట్ల పూర్తి సాటిస్ఫాక్షన్ పొందలేదట. వెరసి.. కొన్ని సీన్స్ రీషూట్ చేస్తే బెటర్ అని డైరెక్టర్ మల్లిక్ రామ్ తో అన్నట్లు వినికిడి. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. టిల్లు క్యారెక్టర్ కి మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. అలాంటిది ఇప్పుడు ఇలా అసంతృప్తికి గురవ్వడం.. రీ షూట్ అంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం లేకపోలేదు. కాకపోతే ఇంకా ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ.. షూటింగ్ ప్రస్తుతానికి ఆపి.. రీ షూట్ ప్రణాళికలు జరుగుతున్నాయని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. మరోవైపు నందినీ రెడ్డితో, బొమ్మరిల్లు భాస్కర్ లతో ఒక్కో సినిమా లాక్ చేసి పెట్టుకున్నాడు సిద్ధు. మరి ఇప్పుడు టిల్లు 2 గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. టిల్లు 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి