iDreamPost

కరోనా ఎఫెక్ట్ – చైనాలో పెరిగిన విడాకుల కేసులు.

కరోనా ఎఫెక్ట్ – చైనాలో పెరిగిన విడాకుల కేసులు.

ప్రపంచం అంతా మహమ్మరిలా ఆవహించిన కరోనా వైరస్ పలు దేశాలను అష్ట దిగ్బంధనంలోకి నెట్టింది. పలు కంపెనీలు ఇంటి నుండే పని చేసే సౌకర్యం కల్పించడంతో ,ఉద్యోగులు సైతం ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. అయితే కరోన వ్యాప్తికి బీజం వేసిన చైనాలో ఆ దేశపు ప్రజలు ఇప్పుడు మరో సరికొత్త సమస్యతో సతమతమౌతున్నారు. వివాహం చేసుకోవడానికి ఒక జంటకి ప్రేమ అనేది కారణం కావచు, కానీ అదే జంట విడిపోవడానికి వారికి అనేక సాకులు ఉండవచ్చు అని చెప్పే చైనీయుల సామెతని నిజం చేస్తూ ఇప్పుడు కరోనా వైరస్ చైనాలో జంటలు విడిపొవడానికి కూడా కారణం అయింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా నెలనుండి ఇంటికే పరిమితం అయిన చైనా ప్రజలకు కుటుంబ సభ్యులతో అధిక సమయం ఉండే అవకాశం లభించింది. అయితే ఇదే చైనా జంటలకి పీడకలగా మారింది. అధిక సమయం జీవిత భాగస్వామితో గడిపికే అవకాశం రావడంతో వారి మద్య వాదోపవాదాలు జరిగి మనస్పర్దలు అధికమై చివరికి వారు విడాకుల వరకు వెళ్తున్నట్లు చైనా రిజిస్ద్టర్ ఆఫ్ మ్యారేజ్ కార్యాలయం చెబుతున్న మాట .

సిచువాన్ ప్రావినెన్స్ లో రిజిస్టర్ ఆఫ్ మ్యారేజ్ కార్యాలయం అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత సగటున రోజుకు విడాకుల కొరకు 300 అప్లికేషన్లు వస్తున్నాయని ఇది కేవలం జంటలు తమ భాగస్వామితో ఎక్కువసేపు సమయం గడపడం వలన జరిగిన పరిణామాలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. కరొనా వైరస్ ప్రభావం ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని విడాకుల కేసులు నమోదయ్యే ఆస్కారం ఉందనే అభిప్రాయం వెలిబుచ్చారు. ఏది ఏమైనా కరోనా చివరికి చైనా ప్రజల వైవాహిక బంధాలపై కూడా ప్రభావం చూపడం శోచనీయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి