iDreamPost

Sankranthi Releases : సంక్రాంతి సినిమాలు – అభిమానుల మధ్య హాట్ డిస్కషన్స్

Sankranthi Releases : సంక్రాంతి సినిమాలు – అభిమానుల మధ్య హాట్ డిస్కషన్స్

నిన్న ఆర్ఆర్ఆర్ వాయిదా పడక ముందు, అఫీషియల్ గా చెప్పాక సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ గొడవంతా దీని గురించి మాత్రమే కాదు. భీమ్లా నాయక్ రావాలని ఒక వైపు, రాధే శ్యామ్ వస్తుందా రాదా అనే అనుమానాలు మరోవైపు, బంగార్రాజు డేట్ ఎందుకు చెప్పలేదనే సందేహాలు ఇంకో వైపు ఇలా రకరకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వలిమై డబ్బింగ్ వెర్షన్ బలంతో తెలుగు మార్కెట్ బలపరుచుకునే అవకాశం అజిత్ కు దీంతో దక్కిందనే డిస్కషన్ కూడా ఈ సందర్భంగా జరిగింది. ఇక రాజమౌళి టీమ్ మీద మాటల దాడి చేసిన వాళ్ళు లేకపోలేదు. నీవల్లే ఇతర సినిమాల ప్లానింగ్ దెబ్బతింటోందని గట్టి కామెంట్లు విసిరారు.

నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎవరూ ఊహించనివి. ముందే తెలుసుంటే రాజమౌళి ఈ స్థాయిలో తన ఇద్దరు హీరోలను వెంటపెట్టుకుని ముంబై నుంచి చెన్నై దాకా ప్రమోషన్లు చేసేవాడు కాదు. లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు ఇప్పించేవాడు కాదు. ఒమిక్రాన్ తీవ్రత మన దేశంలో తక్కువగా ఉంటుందనే అంచనాతో ఇదంతా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. కానీ తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాల్లో కేసులు పెరగడంతో మళ్ళీ యాభై శాతం ఆక్యుపెన్సీ అమలులోకి వచ్చింది. ఓపెనింగ్స్ మీద ఎవరికీ అనుమానం లేదు కానీ ఆర్ఆర్ఆర్ పెట్టుబడి సేఫ్ అవ్వాలంటే వంద శాతం కెపాసిటీతో లాంగ్ రన్ ఖచ్చితంగా జరగాలి. లేకపోతే పెద్ద రిస్కు

ఈ వ్యవహారం మీద లెక్కలేనన్ని మీమ్స్, సెటైరిక్ పోస్టులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. భీమ్లా నాయక్ ని అనవసరంగా ఫిబ్రవరికి వెళ్లేలా చేశారని, లేకపోతే పండక్కు పవర్ స్టార్ సినిమాతో రచ్చ ఓ రేంజ్ లో ఉండేదని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతానికి అయితే త్రివిక్రమ్ టీమ్ చర్చలు జరుపుతున్న మాట వాస్తవమే కానీ ఎంతమేరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయో ఇప్పుడే చెప్పలేం. ఇంత మంచి సీజన్ ని ఒక డబ్బింగ్ మూవీ, ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాకు వదిలేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియా సంగతి ఎలా ఉన్నా ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్స్ లో చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది

Also Read : Movies Postpone : వాయిదాల చెలగాటం – బాక్సాఫీస్ ప్రాణసంకటం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి