iDreamPost

కొత్త చర్చకు తెరతీసిన సూపర్ స్టార్

కొత్త చర్చకు తెరతీసిన సూపర్ స్టార్

స్టార్ హీరోలు ఏం చెప్పినా అది జనమందరూ గుడ్డిగా చేసేయరు కానీ సీరియస్ గా ఫాలో అయ్యే అభిమానులు మాత్రం లక్షల్లో ఉంటారు. ఎంత కాదనుకున్నా ఇది వాస్తవం. తాము ప్రాణంగా భావించే వెండితెర వేల్పులు యాడ్ లో చెప్పినా కూడా నిజమనుకుని వాళ్ళు ప్రమోట్ చేసిన ఉత్పత్తులను కొంటారని చెప్పడానికి ఆయా సంస్థల అమ్మకాలనే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో పెప్సీకి బ్రాండ్ అంబాసడర్ గా చేశాక ఆ తర్వాత మానేశారు. అమితాబ్ బచ్చన్ మ్యాగీ, డైరీ మిల్క్ బ్రాండ్ లను ఎన్ డార్స్ చేసినప్పుడు వచ్చిన విమర్శలు ఎన్నో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇదంతా వన్ సైడ్ వ్యవహారం కాదు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ బహార్ బ్రాండ్ కు అంబాసడర్ గా నటించడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. వాళ్ళు యాడ్స్ లో చెబుతున్న ఉత్పత్తి మౌత్ ఫ్రెష్నరే అయినప్పటికీ స్వతహాగా ఆ కంపెనీ ప్రోడక్ట్స్ అధిక శాతం పొగాకు ఆధారంగా తయారు చేసేవే అన్నది బహిరంగ రహస్యం. కాకపోతే వాళ్ళు అది ఒప్పుకోరు. తమ మీద వచ్చిన అభ్యంతరాలను కూడా తోసిపుచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రకటనల పరంగా పొగాకు సంబంధిత వాటి మీద ఇండియాలో నిషేధం ఉంది కాబట్టి పైకి కేవలం పాన్ మసాలా అంటూనే అన్ని రకాల ఉత్పత్తులను ఈ తరహా దారిలో అమ్మడం అన్ని సంస్థలు చేస్తున్నదే

ఈ విషయంలో మహేష్ బాబుని నెటిజెన్లు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఇంత స్టార్ డం కోట్లాది అభిమానులు ఉన్న సూపర్ స్టార్ ఇలాంటి కంపెనీ తరఫున ఉండకూడదనేది. అంత అవసరం కూడా లేదనేది వాళ్ళ వెర్షన్. గతంలో జేమ్స్ బాండ్ హీరో పియర్స్ బ్రాస్ నన్ కూడా ఇదే తరహాలో యాడ్స్ చేసి ఆ తర్వాత తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ ఏం చేస్తాడన్నది పక్కనపెడితే ఏదైనా డీల్ చేసుకునేముందు ఆ కంపెనీ హిస్టరీ మొత్తం చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను తాను చూసుకునే మహేష్ కు లేనిపోని చిక్కు వచ్చినట్టు అయ్యింది

Also Read : సెలబ్రిటీ జంట ఇంతకీ ఏం చెబుతున్నట్టు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి