సెలబ్రిటీ జంట ఇంతకీ ఏం చెబుతున్నట్టు

By iDream Post Sep. 14, 2021, 12:30 pm IST
సెలబ్రిటీ జంట ఇంతకీ ఏం చెబుతున్నట్టు

ఆ మధ్య నాగ చైతన్య సమంతాలు త్వరలో విడిపోతున్నారని విడాకులకు సర్వం సిద్ధమయ్యిందని ఓ మీడియా వర్గంలో గట్టిగానే ప్రచారం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఇద్దరూ ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో నిజమనుకున్న అభిమానులు లేకపోలేదు. పైగా ఇద్దరు కలిసున్న పిక్స్ ఏ ఒక్కటీ ఇటీవలి కాలంలో ఇన్స్ టా, ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఎక్కడా కనిపించలేదు. ఇది చాలదన్నట్టు దీనికన్నా ముందే సమంత తన పేరులో అక్కినేని తీసేసి జస్ట్ ఎస్ అని పెట్టుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. కొద్దిరోజులు మాట్లాడుకున్నాక మళ్ళీ అంతా సైలెంట్ అనుకుంటే ఇప్పుడు లవ్ స్టోరీ ట్రైలర్ పుణ్యమాని మరోసారి ఈ టాపిక్ చర్చలోకి వచ్చింది.

నిన్న సామ్ చైతు పోస్ట్ ని రీ ట్వీట్ చేసింది. లవ్ స్టోరీ ట్రైలర్ బాగుందని అర్థం వచ్చేలా విన్నర్ అని పెట్టేసి అందులో సాయి పల్లవిని ట్యాగ్ చేసింది. ఇది ఫ్యాన్స్ ని సంతృప్తి పరచలేదు. తన భర్త యాక్టింగ్ గురించి మొదటి సారి తెలంగాణ యాసలో బాగా చేశాడని ఏదైనా చెప్పాలని ఆశించారు. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత వెంటనే చైతన్య రియాక్ట్ అవ్వలేదు. కాస్త టైం తీసుకుని సమంతాకు బదులు ఇస్తూ జస్ట్ థాంక్స్ సామ్ అని పెట్టేసి వదిలేశాడు. మాములుగా ఏదైనా సినిమా విడుదలకు ముందు ఇద్దరూ సరదాగా ట్వీట్లు పెట్టుకోవడం బదులు ఇచ్చుకోవడం మాములే. కానీ ఈసారి దానికి భిన్నంగా జరిగింది

ఇటీవలే జరిగిన నాగార్జున పుట్టినరోజు వేడుకల్లో సమంతా కనిపించకపోవడం, కేవలం ఒక ట్వీట్ తో విష్ చేసి వదిలేయడం లాంటి ఎన్నో సందేహాలకు దారి తీశాయి. ఇదంతా వీళ్ళ వ్యక్తిగత వ్యవహారమే అయినప్పటికీ సెలబ్రిటీ జంట కావడంతో ప్రతిదీ న్యూస్ అవుతోంది. అసలు సమంతా ఎందుకు కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదో అంతు చిక్కడం లేదు. మరోవైపు చైతు లవ్ స్టోరీ రిలీజ్ కోసం సోషల్ మీడియాలోకి వచ్చాడు కానీ చాలా రోజుల నుంచి పెద్ద యాక్టివ్ గా లేడు. ఏది ఏమైనా ఇద్దరిలో ఒక్కరైనా క్లారిటీ ఇస్తే ఇంకెలాంటి డిస్కషన్లు ఉండవు. లేదూ అంటే ఇలా ట్వీట్లకు పోస్టులకు రకరకాల అర్థాలు వచ్చేస్తాయి

Also Read : 50 ఏళ్ళ తర్వాత అక్కినేని సెంటిమెంట్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp