iDreamPost

వెంకటేష్‌ మహా ఏంటి ఇంతలా సీరియస్‌ అయ్యాడు!

కేజీఎఫ్‌ సినిమాలపై కామెంట్లు చేసి ట్రోలింగ్స్‌కు గురవుతున్నారు దర్శకుడు వెంకటేష్‌ మహా. ట్రోలింగ్స్‌ విపరీతంగా పెరగటంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

కేజీఎఫ్‌ సినిమాలపై కామెంట్లు చేసి ట్రోలింగ్స్‌కు గురవుతున్నారు దర్శకుడు వెంకటేష్‌ మహా. ట్రోలింగ్స్‌ విపరీతంగా పెరగటంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

వెంకటేష్‌ మహా ఏంటి ఇంతలా సీరియస్‌ అయ్యాడు!

‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు వెంకటేష్‌ మహా. చిన్న చిత్రంగా వచ్చిన కేరాఫ్‌ కంచరపాలెం పెద్ద హిట్‌ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించింది. ఈ మూవీతో వెంకటేష్‌ మహా పేరు చిత్ర పరిశ్రమలో మారుమోగింది. ఆయన తర్వాతి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత వెంకటేష్‌ ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య’ అనే సినిమా చేశారు. ఇది మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘ మహేషింటే ప్రతీకారం’కు రీమేక్‌గా వచ్చింది.

ఆశించిన స్థాయిలో ఈ చిత్రానికి ఆధరణ లభించలేదు. సినిమా బాగానే ఉన్నా కలెక్షన్ల పరంగా దెబ్బతింది. ఆ తర్వాత వెంకటేష్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ అనే సిరీస్‌లో ఓ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు తగ్గించేశారు. నటుడిగా, రైటర్‌గానే కొనసాగుతున్నారు. అయితే, కొన్ని నెలల క్రితం ఆయన ఓ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొని కేజీఎఫ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో తల్లి పాత్రను కించపరిచారు. హీరో పాత్రను నీచ్‌ కమీనే కుత్తే అంటూ దుర్భాషలాడారు.

director venkatesh maha

అసలు దాన్ని సినిమా అంటారా? అంటూ ప్రశ్నించారు. దీంతో కాంట్రవర్సీ మొదలైంది. ఆయన కేజీఎఫ్‌ చిత్రంపై చేసిన వ్యాఖ్యల తాలూకా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నెటిజన్లు వెంకటేష్‌పై ట్రోలింగ్స్‌ చేయటం మొదలుపెట్టారు. ట్రోలింగ్స్‌ ధాటికి ఆయన తట్టుకోలేకపోయారు. కొన్ని రోజుల క్రితం కేజీఎఫ్‌ వివాదంపై స్పందించారు. తను వాడిన పదాలు తప్పుగా ఉన్నాయని, ఉద్ధేశ్యం మాత్రం తప్పు కాదని తెలిపారు. అయినా ట్రోలింగ్స్‌ ఆగలేదు.  ట్రోలింగ్స్‌ మితిమీరటంతో ఆయన సహనం కోల్పోయారు.

ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ వదిలేస్తే మాట వినరుగా మీరు. సరే చెప్తున్నా వినండి. ఎన్ని సినిమాలు తీశామనేది కాదు ముఖ్యం. ఏం సినిమా తీశామనేదే ముఖ్యం. నేను గర్వంగా చెప్పుకుంటాను.. తెలుగులో కొన్ని అద్భుతమైన సినిమాలు చేశానని.. ఇకపై చేస్తానని. ఊరుకుంటున్నా కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంక ఊరుకోను. అవసరం అయితే.. నేను ఈ ట్రోలింగ్స్‌పై వ్యక్తిగతంగా.. చట్టపరంగా పోరాడుతాను. వీళ్లనోర్లు మూయించడానికి మీరు నా వెనకాల ఉండాలని కోరుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

కాగా, ఆయన కథతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ‘ మార్టిన్‌ లూథర్‌కింగ్‌’ సినిమా అక్టోబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. వెంకటేష్‌ మహా నటించిన ‘ అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరి, ట్రోలింగ్స్‌పై వెంటకేష్‌ మహా ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి