iDreamPost

Vyooham Movie: ‘వ్యూహం’ సెన్సార్ రద్దు కాలేదు.. క్లారిటీ ఇచ్చిన RGV!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా వ్యూహం. ఈసినిమా సెన్సార్ రద్దైంది అంటూ జరుగుతున్న ప్రచారాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్లారీటి ఇచ్చారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా వ్యూహం. ఈసినిమా సెన్సార్ రద్దైంది అంటూ జరుగుతున్న ప్రచారాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్లారీటి ఇచ్చారు.

Vyooham Movie: ‘వ్యూహం’ సెన్సార్ రద్దు కాలేదు.. క్లారిటీ ఇచ్చిన RGV!

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ వ్యూహం.  ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇక డిసెంబర్ 29న ఈ వ్యూహం సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా విడుదల ఆగిపోయింది. అయితే  దీనిపై కొన్ని మీడియాలు, కొందరు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిందని సోషల్ మీడియాలో వార్త‌లు ప్రచారం చేశారు. తాజాగా ఈ వార్త‌ల‌పై ద‌ర్శ‌కుడు ఆర్జీవీ క్లారిటి ఇచ్చాడు. ఆ వార్త‌లు ఫేక్ అంటూ ఎక్స్‌లో రాసుకోచ్చాడు. అంతేకాక కొందరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్  రెడ్డి పొలిటికల్ లైఫ్ ఆధారంగా, అక్కడి రాజకీయ పరిస్థితులపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  వ్యూహం, శపథం అనే రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారు.  వ్యూహం డిసెంబర్ 29న, శపథం ఫిబ్రవరి నెలలో విడుదల కావాల్సి ఉంది. వైఎస్ మరణం తరువాత జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను  ఆర్జీవి తెరకెక్కించారు. మొదటి పార్ట్ అయిన వ్యూహం డిసెంబరు 29న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.

ragv talk about his movie

అయితే సెన్సార్ సర్టిఫికేట్  రద్దు చేయాలని నారా లోకేశ్ పిటిషన్ వేయడంతో.. జనవరి 11వరకు సెన్సార్ సర్టిఫికెట్ ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై విపక్షలు, కొన్ని మీడియాలు  తెగ హడావుడి చేశాయి. ఏకంగా సినిమా సెన్సార్ రద్దు చేశారన్నంత రేంజులో హడావుడి చేస్తోంది. ఇలా అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న వారికి  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏబీఎన్ ఛానల్ కి సంబధించిన ఈ వ్యక్తి, ఇంకా మరికొన్ని ఛానెల్స్ చెప్తున్నట్లు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు అవ్వలేదని ఆర్జీవీ తెలిపారు. నిజం ఏంటంటే.. కోర్టు, సీబీఎఫీసీ నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12లో సమర్పించాలని అడిగారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. దీనిబట్టి చూస్తే.. త్వరలోనే  ఈ ఇష్యూ క్లియర్ అయి వ్యూహం సినిమా విడుదలవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి