iDreamPost

సూపర్ స్టార్ తో సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న బింబిసార డైరెక్టర్!

  • Author ajaykrishna Published - 02:16 PM, Thu - 20 July 23
  • Author ajaykrishna Published - 02:16 PM, Thu - 20 July 23
సూపర్ స్టార్ తో సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న బింబిసార డైరెక్టర్!

సూపర్ స్టార్ రజినీతో సినిమా చేయాలని ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న.. లేదా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన.. రాబోతున్న డైరెక్టర్స్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన తీరు.. ఏనాడూ తన హోదాను చూపించుకోని సింప్లిసిటీ.. తెరపై ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ.. యాక్షన్ అన్ని తరతరాలుగా ప్రేక్షకులకు బాగా ఎక్కేసాయి. అదిగాక ఇండస్ట్రీలోకి వద్దాం అనుకునేవారికి ఆయన ఎప్పుడూ రోల్ మోడలే. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అలాంటి సూపర్ స్టార్ తో సినిమా చేయాలని.. ఆయన్ని డిఫరెంట్ స్టైల్ లో ప్రెజెంట్ చేయాలని ఒక్క అవకాశం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తుంటారు. అనుకోగానే అవకాశం వస్తే ఆయన సూపర్ స్టార్ ఎలా అవుతారు.

రజినీ తెరపై ఎంత గ్రాండ్ గా కనిపిస్తారో.. ఆఫ్ స్క్రీన్ లో అసలు ఎక్స్ పెక్ట్ చేయనంత సింపుల్ గా ఉంటారు. సూపర్ స్టార్ గతంలో తెలుగు డైరెక్టర్స్ తో వర్క్ అప్పుడప్పుడు వర్క్ చేస్తూనే వచ్చారు. కానీ.. దాదాపు చాలా ఏళ్లుగా తెలుగు డైరెక్టర్స్ ఎవరు రజినీతో సినిమాలు చేయలేదు. కనీసం ప్రయత్నాలు చేశారని టాక్ కూడా రాలేదు. కానీ.. రెగ్యులర్ గా ఆయన తమిళ డైరెక్టర్స్ తో సినిమాలు చేసినా.. ఆయా సినిమాలు తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో రీసెంట్ గా ఓ యంగ్ తెలుగు డైరెక్టర్ రజినీని సంప్రదించి.. కథ చెప్పి ఓ సినిమా లాక్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. అతని ఆశలన్నీ నిరాశలు అయినట్లు తెలుస్తోంది.

ఆ డైరెక్టర్ ఎవరో కాదు. గతేడాది కళ్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ తెరకెక్కించిన వశిష్ఠ. డెబ్యూ మూవీ అయినప్పటికీ.. బింబిసార బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. నెక్స్ట్ బింబిసారకు సీక్వెల్ కూడా లైన్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ వశిష్ఠ.. సూపర్ స్టార్ ని కలిసి కథ చెప్పి.. ఒప్పించే ప్రయత్నం చేసాడట. కానీ.. అప్పటికే కమిట్మెంట్ ఇచ్చిన సినిమాల కారణంగా రజినీ.. వశిష్ఠకు నో చెప్పాడని సమాచారం. మరోవైపు రజినీ కూడా వయసు మీద పడింది. కాబట్టి.. కొత్తగా సినిమాలేవి ఓకే చేయడం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే.. వశిష్ఠ కంటే ముందు రజినీ.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా కమిట్ అయ్యారు. అది మాత్రం త్వరలో పట్టాలెక్కనుంది. మరి తెలుగు డైరెక్టర్ ప్రయత్నం విఫలం అవ్వడంతో తెలుగు ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి రజినీతో వశిష్ఠ కాంబినేషన్ పడితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి