iDreamPost

Guntur Kaaram: గుంటూరు కారంకి మిడ్ నైట్ షోస్? అర్ధరాత్రి నుండే రికార్డ్స్ నరుకుడు!

గుంటూరు కారం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనుంది. నైజాం ఏరియాకు సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు డిస్ట్రిబ్యూషన్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నారు.

గుంటూరు కారం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనుంది. నైజాం ఏరియాకు సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు డిస్ట్రిబ్యూషన్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నారు.

Guntur Kaaram: గుంటూరు కారంకి మిడ్ నైట్ షోస్? అర్ధరాత్రి నుండే రికార్డ్స్ నరుకుడు!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ గుంటూరు కారం’ సినిమా విడుదలకు కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12వ తేదీనుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్‌ ఆ అంచనాలను మరింత పెంచుతూ పోతున్నాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. గుంటూరు కారం నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కుల్ని దిల్‌ రాజు సొంతం చేసుకున్నారు.

విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆయన టికెట్ల రేట్లు, స్పెషల్‌ షోల గురించి ఆలోచిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. టికెట్‌ రేట్ల విషయానికి వస్తే.. టికెట్‌ ధరలు మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు, సింగిల్స్‌లో 60 రూపాయలు పెంచాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా 22 థియేటర్లలో ఫ్యాన్స్‌ కోసం 1 గంట షోకు అనుమతి ఇవ్వాలని కోరారు.  ఏఎంబీ, నెక్సస్‌, కేపీహెచ్‌బీ 4, శ్రీరాములు, కోకుల్‌, సాయిరామ్‌, ఎస్‌ఆర్‌ ప్రేమ(తుక్కుగూడ), సుదర్శన్‌ థియేటర్లతో పాటు..

జిల్లాల్లోని మమత, వినోద్‌, తిరుమల, అమృత, రాధిక, ఎస్‌వీసీ గద్వాల్‌లతో పాటు మహబూబ్‌ నగర్‌లోని మరో రెండు థియేటర్లలో ఫ్యాన్స్‌ షోలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 6 షోలకు పర్మిషన్‌ అడిగారు. మరి, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి​. కాగా, గుంటూరు కారం.. మహేష్‌ బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా. వీరి కాంబినేషన్‌లో 2005లో ‘అతడు’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘ఖలేజా’ మూవీ చేశారు. ఈ మూవీ 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ‘ గుంటూరు కారం’ సినిమా కోసం పని చేస్తున్నారు. దీంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ సూపర్‌ హిట్‌ అవ్వనుందని అందరూ భావిస్తున్నారు. మరి, గుంటూరు కారం సినిమా టికెట్ల రేట్ల పెంపుపై నిర్మాత దిల్‌ రాజు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి