iDreamPost

థియేటర్స్ అన్నీ ‘గుంటూరు కారం’కే! డిస్ట్రిబ్యూషన్ డైనోసార్ ప్లాన్!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కిన మాస్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నైజాంలో విడుదల చేస్తున్న దిల్ రాజు మాస్ ప్లాన్ వేసినట్లు టాక్.

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కిన మాస్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నైజాంలో విడుదల చేస్తున్న దిల్ రాజు మాస్ ప్లాన్ వేసినట్లు టాక్.

థియేటర్స్ అన్నీ ‘గుంటూరు కారం’కే! డిస్ట్రిబ్యూషన్ డైనోసార్ ప్లాన్!

సినీ ఇండస్ట్రీ అనేది బయట చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ, లోపల ఎన్నో కష్టనష్టాలు ఉంటాయి. ముఖ్యం  సినిమా విషయంలో  ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. సినిమా తీయడం ఒక లెక్క అయితే, దానిని విడుదల చేయడం మరో టాస్క్ లా ఉంటుంది. ఎంత కష్టపడి సినిమా తీసినా.. సరైన ప్లాన్ తో విడుదల చేయకపోతే.. అనుకున్న ఫలితాలు రావు అనేది అందరికి తెలిసిన విషయమే. అందుకే నిర్మాతలు, దర్శకులు సరైన ప్రణాళికతో సినిమాలు విడుదల చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా గుంటూరు కారం విషయంలో ఓ ఊర మాస్ ప్లాన్ వేశారని టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన నిర్మిస్తున్నారని తెలిసే.. హీరో, హీరోయిలను చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు. అంతాల ఇండస్ట్రీలో దిల్ రాజు తనదైన మార్క్ ను చూపించారు. ప్రేక్షకుల నాడీ తెలుసుకుని, అందుకు తగినట్లు దిల్ రాజు సినిమాలు నిర్మిస్తుంటారు. అందేకే ఆయన నిర్మాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలానే చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉంటున్నారు. ఆయన సినిమాల విషయంలో వేసే ప్లాన్ కు అందరు ఫిదా అవుతుంటారు. కారణం.. దిల్ రాజ్ వేసే ప్రణాళికు వందకు వందశాతం సక్సెస్ అవుతాయనేది చాలా మంది అభిప్రాయం. తాజాగా గుంటూరు కారం సినిమాను నైజాంలో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

dil raju mass plan

 

నైజామ్ లో గుంటూరు కారంని విడుదల చేస్తున్న దిల్ రాజు ఊర మాస్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఉదాహరణకు హైదరాబాద్ లో ఉన్న 96 సింగిల్ స్క్రీన్లకు గాను 90 కేవలం గుంటూరు కారం మూవీ  ఆడేలా  ప్లాన్ చేశారట. మిగిలిన అతి కొన్ని స్క్రీన్ల పై హనుమాన్, మెర్రీ క్రిస్మస్ లాంటి ఇతర సినిమాలు పంచుకుంటాయి.  గుంటురూ కారం జనవరి 12 విడుదల కానుంగా, 13, 14 వరసగా మరో మూడు క్రేజీ మూవీస్ రిలీజులుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు తొలి రోజు వసూలు రాబట్టుకుంటే తప్ప రికార్డుల బూజు దులపడం కష్టమని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా గుంటూరు కారం సినిమా విషయంలో ఇదే స్ట్రాటజీ అమలు పరుస్తారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే విడుదల రోజు.. తెల్లవారు జామున 4 గంటల నుంచి షోలు వేసుకునేలా  పర్మిషన్ల కోసం  ఇప్పటికే దరఖాస్తు పెట్టేశారట. సలార్ మూవీకి ఇచ్చిన పెంపునే తమకూ ఇవ్వమని విన్నపం చేయడంతో దాదాపు నో అని చెప్పకపోవచ్చు. బెనిఫిట్ షో టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ వచ్చేలా కనిపిస్తోంది.

గుంటూరు కారం కమర్షియల్ సినిమానే అయినప్పటికీ సర్కారు వారి పాట తర్వాత చాలా గ్యాప్ తరువాత ప్రిన్స్ మహేష్ బాబు వస్తున్నాడు. దీంతో మహేష్ బాబును తెరమీద ఊర మాస్ అవతారంలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కుర్చీ మడతపెట్టి పాట వచ్చాక ఈ హైప్ మరింత ఎక్కువయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ తాలూకు వివరాలు తెలియాల్సి ఉంది. ఇక గుంటూరు కారం మూవీ విడుదల సన్నాహకాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి