iDreamPost

చిత్రవిచిత్రమైన టాస్కులు – వెరైటీ పరీక్షలు

చిత్రవిచిత్రమైన టాస్కులు – వెరైటీ పరీక్షలు

మొన్న అమీ తుమీ పేరుతో డీల్స్ అటకు తెరతీసిన బిగ్ బాస్ నిన్న ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయి ఇవేం గేమ్స్ రా బాబు అనిపించేలా చేశాడు. ఒకదాన్ని మించి మరొకటి చిత్ర విచిత్రమైన ప్రపోజల్స్ ఇచ్చాడు. విషయానికి వస్తే ఏడో డీల్ లో భాగంగా సగం గుండు సగం మీసం తీసుకోవడానికి రెడీ అయినవాళ్లు 40 కాయిన్స్ ఖర్చు పెట్టుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ ముందుకు వచ్చాడు. తల్లి చనిపోయినప్పుడు కూడా చేయని త్యాగానికి ఇప్పుడు సిద్ధం అంటూ సై అన్నాడు. అయితే అభిజిత్, దివిలో కన్విన్స్ చేయడంతో డ్రాప్ అయ్యారు. అరియనా టీమ్ లో కూడా డిస్కస్ చేసుకున్నారు కానీ సగం గుండుతో లాభం లేదని గుర్తించారు.

బయట బ్యాడ్ పాపులారిటీ తప్ప వచ్చేదేమి లేదని అర్థమైపోయి ఫైనల్ గా ఇది బిగ్ బాస్ తోనే వద్దు అనిపించేలా చేశారు. తర్వాత బురద పేడ నిండిన బాత్ టబ్ లో వంద నాణేలు వెలికి తీయడానికి 30 కాయిన్స్ చెల్లించాలనే ప్రతిపాదన రావడం తో దివి ఆ పని చేసింది. కానీ 93 దొరకడంతో కన్నీళ్లు పెట్టుకుంది. మాస్కు వేసుకుని అరటిపండు తినే టాస్కుకి 10 కాయిన్స్ కాన్సెప్ట్ వచ్చింది. అవినాష్ గట్టిగానే ట్రై చేశాడు. ఇదంతా ఎబ్బెట్టుగానే అనిపించింది. తర్వాత టాస్కులో భాగంగా కుర్చీలో కూర్చుకున్న సభ్యుడిని బిగ్ బాస్ లేవమని చెప్పేంత వరకు వాష్ చేస్తూనే ఉండాలనే కండిషన్ పెట్టారు. ఇందులో అఖిల్ కి మోనాల్ విసుగొచ్చేదాకా వాష్ చేసింది. ఈ సందర్భంగా మెహబూబ్, అభిజిత్, దివిల మధ్య కాసేపు ఓవర్ డ్రామా నడిచింది.

బిగ్ బాస్ ని అవినాష్ ఎవడు బే అని ఏకవచనంతో సంబోధించి బెదిరించడం, సోహైల్ గుక్కతిప్పుకోకుండా ఏడవడం, అఖిల్-మోనాల్ లు మళ్ళీ లవ్ స్టోరీని కంటిన్యూ చేయడం, నోయెల్ తొడగొట్టి ఛాలెంజ్ చేయడం, కొట్టు తలతో ఢీ కొట్టు గేమ్ లో పరస్పరం రెచ్చగొట్టుకోవడం, మెహబూబ్ ని నోయల్ రేషన్ మేనేజర్ ని చేయడం తదితరాలతో బిగ్ బాస్ ఫ్యాన్స్ కి తగ్గట్టు హంగామాతో సాగిపోయింది. ఏది ఏమైనా టాస్కుల పేరుతో బిగ్ బాస్ చేయిస్తున్న పనులు మాత్రం చాలా మటుకు సిల్లీగా ఉంటున్నాయి. జుత్తు కత్తిరించడం, గుండు కొట్టుకోమని చెప్పడం ఇవన్నీ బాలీవుడ్ నుంచి తెచ్చుకున్నవే అయినా ఇక్కడ ఆడియన్స్ కి అలాంటివి అంతగా కనెక్ట్ కావు సరికదా అతిగా కూడా అనిపిస్తాయి. ఏది ఎలా ఉన్నా ఐపిఎల్ ని తట్టుకుని రేటింగ్ రాబట్టుకోవడానికి బిగ్ బాస్ పడుతున్న తంటాలు మాత్రం మాములుగా లేవు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి