iDreamPost

లేడీ గెటప్ లో ఉన్న ఈ టీమిండియా దిగ్గజ క్రికెటర్ ను గుర్తుపట్టారా?

కింద కనిపిస్తున్న ఫొటోలో లేడీ గెటప్ లో ఉన్నది ఓ టీమిండియా దిగ్గజ క్రికెటర్. అతడెవరో మీరు గుర్తుపట్టారా?

కింద కనిపిస్తున్న ఫొటోలో లేడీ గెటప్ లో ఉన్నది ఓ టీమిండియా దిగ్గజ క్రికెటర్. అతడెవరో మీరు గుర్తుపట్టారా?

లేడీ గెటప్ లో ఉన్న ఈ టీమిండియా దిగ్గజ క్రికెటర్ ను గుర్తుపట్టారా?

సోషల్ మీడియా వాడకం పెరిగాక సెలబ్రిటీలకు చెందిన ఓల్డ్ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతూ ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాను ఓ వీడియో షేక్ చేస్తుంది. ఆ వీడియోలో ఓ టీమిండియా దిగ్గజ బ్యాటర్ లేడీ గెటప్ లో కనిపించాడు. ఓ అడ్వర్టైజ్ మెంట్ లో భాగంగా అతడు పలు గెటప్పుల్లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. మరి ఆ లేడీ గెటప్ లో ఉన్న దిగ్గజ క్రికెటర్ ను మీరు గుర్తుపట్టారా? మీకో హింట్ ఇస్తున్నాను.. అతడు బ్యాటింగ్ కు దిగితే బౌలర్లకు విసుగుపుట్టి చెమటలు పట్టాల్సిందే. ఇప్పటికీ ఆ ఆటగాడు ఎవరో మీకు తెలీయలేదా? ఇక ఆ లేడీ గెటప్ లో ఉన్న ఆ దిగ్గజ క్రికెటర్ ఎవరో నేనే చెబుతా పదండి..

పై ఫొటోలో లేడీ గెటప్ లో కనిపిస్తున్నది ఓ టీమిండియా దిగ్గజ క్రికెటర్. అతడెవరో మీరు కనిపెట్టారా? ఈ బ్యాటర్ క్రీజ్ లోకి వస్తే.. అతడిని ఔట్ చేయలేక బౌలర్లకు విసుగుపుట్టాల్సిందే. అంతలా తన బ్యాటింగ్ తో వారి సహనానికి పరీక్షపెడుతుంటాడు. ఇప్పటికైనా అతడు ఎవరో ఓ ఐడియా వచ్చిందా? ఇంకా రాలేదా? అయితే కంగారు పడకండి నేనే చెబుతా. లేడీగెటప్ లో ఉన్నది ఎవరో కాదు.. టీమిండియా వాల్ మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ ద్రవిడ్. అవును గతంలో 1998-99 మధ్య కాలంలో కిసాన్ జామ్ కు సంబంధించిన ఓ యాడ్ లో వివిధ గెటప్ ల్లో దర్శనమిచ్చాడు టీమిండియా వాల్. అందులో భాగంగానే లేడీ గెటప్ లో కనిపించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచాడు.

రాహుల్ ద్రవిడ్ కెరీర్ ఆరంభంలో పలు యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక తన బ్యాటింగ్ తో టీమిండియాకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు ద్రవిడ్. జిడ్డు బ్యాటింగ్ తో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టేవాడు. ఎంతటి దిగ్గజ బౌలరైనా ద్రవిడ్ బ్యాటింగ్ ముందు తలొగ్గాల్సిందే. ఇక ఈ దిగ్గజ బ్యాటర్ కెరీర్ విషయానికి వస్తే.. 164 టెస్టుల్లో 13,288 పరుగులు చేశాడు. అలాగే 344 వన్డేల్లో 10,889 రన్స్ తో పాటుగా 89 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 2174 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా జట్టుకు హెడ్ కోచ్ గా తన సేవలను అందిస్తున్నాడు రాహుల్ ద్రవిడ్. మరి ఈ ఫొటోను చూడగానే ఎంతమంది ఆ లేడీ గెటప్ లో ఉన్నది రాహుల్ ద్రవిడ్ అని గుర్తుపట్టారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by The90sIndia🤩 (@the90sindia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి