iDreamPost

చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాప్ చేపించాడా?

చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాప్ చేపించాడా?

ఏదో సినిమాలో నమ్మినోళ్ళను మోసం చేయొచ్చా అంటాడు ఒకాయన ..దానికి ఇంకో ఆయన “నమ్మినోళ్ళనే కదా మోసం చేయగలం”” అంటాడు. ఈ విషయం చంద్రబాబు విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మోసం, దగా, వంచన వంటివే కీలకపాత్ర పోషిస్తూ వచ్చాయి. ఏ దశలోనూ ఈ మౌళిక సూత్రాలను ఆయన వదులుకోలేదు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాబు చేతిలో వెన్నుపోటుకు గురైనట్లు తెలుస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపికి పవన్ కళ్యాణ్ ప్రధాన మద్దతుదారుగా ఉన్నారు. రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని దక్కించుకున్నారు. ఆ తరువాత కూడా పవన్ పలు అంశాల్లో ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక మాత్రం జనసేనను చంద్రబాబు ప్రభుత్వం ఓ కంట కనిపెడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు మీద వచ్చిన అభియోగాల్లో ఫోన్ల ట్యాపింగ్ అంశము కూడా ప్రధానంగా నిలిచింది. మావోయిస్టుల కదలికలను పసిగట్టే టెక్నాలజీని ఏపీ సర్కారు అప్పట్లో ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. వాటిని ఉపయోగించి మావోయిస్టుల కదలికలు ఏమేరకు కనుగొన్నారో తెలీదుగాని ఆ టెక్నాలజీని రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రం గట్టిగానే ప్రయోగించారని అంటున్నారు. ప్రతిపక్ష నేతలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ ముఖ్యులు సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయ్ సాయి రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ఆ టెక్నాలజీని వినియోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి .

పనిలో పనిగా తమ రాజకీయ మిత్రుడు అయిన పవన్ కళ్యాణ్ ఫోన్లను కూడా ట్యాప్ చేసారని అంటున్నారు. పవన్ ఎవరెవరితో ఏమేం మాట్లాడుతున్నారో ఈ మెషీన్లతో కనిపెట్టి ఆ మేరకు రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేసినట్లు చెబుతున్నారు. అంటే తమకు మద్దతిదారుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫోన్లను సైతం వదల్లేదట..ఈ విధంగా పవన్ ను సైతం చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. ఆ తరువాత 2019 ఎన్నికల్లో జనసేన, టిడిపిలు విడివిడిగా పోటీచేసినట్లు నటిస్తూనే గాజువాక, మంగళగిరి వంటి కొన్ని చోట్ల లోపాయకారి సహకారం అందించుకున్నారు. మొత్తానికి ఎన్నికల్లో ఇద్దరూ ఘోరపరాజయం చెందారు. అయితే తమ నాయకుడిని సైతం చంద్రబాబు మోసం చేసారని, ఫోన్లను ట్యాప్ చేసారని తెలిసి జన సైనికులు లోలోన కుమిలిపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి