iDreamPost

ఓటిటి లోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ధూమమ్’! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • Author ajaykrishna Published - 04:13 PM, Mon - 3 July 23
  • Author ajaykrishna Published - 04:13 PM, Mon - 3 July 23
ఓటిటి లోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ధూమమ్’! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళం యాక్టర్స్ లో ఫాహద్ ఫాజిల్ ఒకరు. పేరుకు పరభాషా నటుడు అయినప్పటికీ.. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో ఫాహద్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఆల్రెడీ డబ్బింగ్ సినిమాలతో పరిచయమైనా.. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షేకావత్ పాత్రతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అయితే.. ఫాహద్ ఏ భాషలో సినిమాలు చేసినా.. అవి విజయం సాధించడంలో మన తెలుగువాళ్ళ ప్రోత్సాహం కూడా కాస్తోకూస్తో ఉండనే ఉంటుంది. ఇక ఫాహద్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు.. రీసెంట్ గా ఫాహద్ హీరోగా ‘ధూమమ్’ అనే మూవీ రూపొందించారు. ‘యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. గత నెల 23న కన్నడ, మలయాళం భాషలలో థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే.. తెలుగులో కూడా డబ్ వెర్షన్ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. కేవలం కన్నడ, మలయాళం వరకే పరిమితం అవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ధూమమ్ మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు.

ఇక ధూమమ్ సినిమా థియేటర్స్ రిలీజైన నెల రోజులకే ఓటిటి రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీ జులై 21 నుండి స్ట్రీమింగ్ కానుందట. అయితే.. ఓటిటిలో మాత్రం తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానుందని టాక్. కాగా.. ప్రస్తుతానికి ధూమమ్ ఓటిటి రిలీజ్ గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ సినిమాలో ఫాహద్ సరసన ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. ఇక చూడాలి త్వరలో ధూమమ్ ఓటిటి రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందేమో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి