iDreamPost

ధమాకా 10 రోజుల వసూళ్లు – డబుల్ జింతాక్

ధమాకా 10 రోజుల వసూళ్లు – డబుల్ జింతాక్

మాస్ మహారాజా రవితేజ ధమాకాలో ఊర మాస్ కంటెంట్ మీద రివ్యూలు పబ్లిక్ టాక్ ఎలా వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సోలో అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడేసుకుని కొత్త సంవత్సరం మొదటి రోజు కూడా వసూళ్ల వర్షం కురిపించుకుంది. నిన్న థియేటర్లలో ధమాకా సందడి మాములుగా లేదు. పదో రోజు వచ్చిన కలెక్షన్లలో నాన్ రాజమౌళి సినిమాలను మినహాయిస్తే టెన్త్ డే ఫస్ట్ ప్లేస్ ఈ జింతాకు సినిమానే తీసుకుంది. ఏకంగా 4 కోట్ల 20 లక్షల దాకా షేర్ తో ట్రేడ్ ని వామ్మో అనిపించేసింది. నిఖిల్ 18 పేజెస్ సైతం గత వారంతో పోలిస్తే చాలా మెరుగైన ఫిగర్లతో డీసెంట్ అనిపించుకుంది. అసలు రీ రిలీజ్ మూవీ ఖుషీకి నిన్న హౌస్ ఫుల్స్ పడటం మరో షాక్.

ఇక లెక్కల విషయానికి వస్తే ధమాకా పది రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజామ్ 13 కోట్ల 85 లక్షలు, సీడెడ్ 5 కోట్ల 45 లక్షలు, ఉత్తరాంధ్ర 3 కోట్ల 63 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 2 కోట్ల 45 లక్షలు, గుంటూరు 1 కోటి 50 లక్షలు, కృష్ణా 1 కోటి 45 లక్షలు, నెల్లూరు 78 లక్షల దాకా వచ్చింది. మొత్తం కలిపితే ఏపి తెలంగాణ నుంచి 29 కోట్ల 20 లక్షల దాకా తేలుతుంది. రెస్ట్ అఫ్ ఇండియా నుంచి మరో 2 కోట్ల 85 లక్షలు, ఓవర్సీస్ 2 కోట్ల 25 లక్షలు కలిపి రెండో వారంలోకి ఎంటర్ కాకుండానే 34 కోట్ల 25 లక్షల దాకా షేర్ వచ్చింది. గ్రాస్ 70 కోట్లకు పైమాటే. నిర్మాతలు పోస్టర్లలో వేస్తున్న అఫీషియల్ ఫిగర్లు కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ మొత్తంగా ఇది డబుల్ ధమాకానే

దీనికింకో పది రోజుల రన్ సులభంగా దక్కనుంది. 12న సంక్రాంతి సందడి స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేవు. ఎలాగూ థియేటర్లు ఎగిరిపోతాయి కాబట్టి జనవరి 6న వచ్చే రిస్క్ ఎవరూ తీసుకోవడం లేదు. ధమాకాతో పాటు అవతార్ 2 ది వే అఫ్ వాటర్ కు సైతం నిన్న భారీ వసూళ్లు వచ్చాయి. కొత్త సంవత్సరం రోజు థియేటర్ కు వెళ్లకపోతే ఏదో వెలితిగా ఫీలయ్యే జనాలు భారీగా ఉండటం వల్లే ఇవి సాధ్యమయ్యాయి. రవితేజకు ఈ సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. తక్కువ గ్యాప్ లో వాల్తేరు వీరయ్య వస్తోంది కాబట్టి అది కూడా హిట్టు కొడితే తిరిగి ఏప్రిల్ లో రిలీజయ్యే మరో భారీ చిత్రం రావణాసురతో హ్యాట్రిక్ కోసం ఎదురు చూడొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి