iDreamPost

ఆ యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే ఖాతా ఖాళీ.. బీ అలెర్ట్!

  • Published Feb 03, 2024 | 6:06 PMUpdated Feb 03, 2024 | 6:06 PM

సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి వీడియోకు లైకులు, కామెంట్లు పెట్టడం కామన్ అయిపోయింది. అయితే, ఇప్పుడు వీటి వలన ఓ కొత్త రకం భయం మొదలైంది. యూట్యూబ్ లో లైక్స్ కొట్టారో అంతే సంగతులు ఖాతాలు ఖాళీలైపోతున్నాయట.

సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి వీడియోకు లైకులు, కామెంట్లు పెట్టడం కామన్ అయిపోయింది. అయితే, ఇప్పుడు వీటి వలన ఓ కొత్త రకం భయం మొదలైంది. యూట్యూబ్ లో లైక్స్ కొట్టారో అంతే సంగతులు ఖాతాలు ఖాళీలైపోతున్నాయట.

  • Published Feb 03, 2024 | 6:06 PMUpdated Feb 03, 2024 | 6:06 PM
ఆ యూట్యూబ్ వీడియోలకు లైక్  కొడితే ఖాతా ఖాళీ.. బీ అలెర్ట్!

ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ యుగమే నడుస్తోంది. టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నందుకు.. ఆనందపడాలో లేదా అదే టెక్నాలజీ కారణంగా ప్రజలు మోసపోతున్నందుకు విచారించాలో.. తెలీకుండా పోతుంది. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎవరికీ నచ్చిన వీడియోలను, ఫోటోలను వారు పోస్ట్ చేస్తూ.. లైక్స్ , కామెంట్స్ తో కాలాన్ని గడిపివేస్తున్నారు. ఇదే అదునుగా భావించి మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ క్రైమ్ నేరాల మీద ఎంత అవగాహన కల్పిస్తున్నా సరే.. ఎక్కడో ఒక దగ్గర ఎదో ఒక విధంగా ఈ సైబర్ నేరాలకు .. ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఈ విషయమై తాజాగా జరిగిన సైబర్ క్రైమ్‌ వర్క్‌షాప్ లో .. డీజీపీ రవి గుప్తా మాట్లాడుతూ.. యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొడితే.. ఖాతాలు ఖాళీ అవుతున్నాయంటూ.. కొత్త సైబర్ మోసాల గురించి చెప్పుకొచ్చారు.

తాజాగా.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో.. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో.. సైబర్ క్రైమ్‌ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్‌తో పాటు మరికొంతమంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ లో ఇటీవల జరుగుతున్న సైబర్ క్రైమ్స్.. వాటి నుంచి ఎలా అలర్ట్‌గా అనే విషయాల గురించి చర్చించారు. అయితే, ఈ సందర్భంలో డీజీపీ రవి గుప్తా మాట్లాడుతూ.. తనకు కూడా ఈ సైబర్ మోసగాళ్ల నుంచి కాల్స్ వచ్చాయంటూ ఇలా చెప్పుకొచ్చారు. ” నేను సైబర్ క్రిమినల్స్ నుంచి తప్పించుకోవడానికి రెండు బ్యాంక్ అకౌంట్స్ మెయింటెన్ చేస్తున్నానను. ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే మెయిన్ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్‌కి డబ్బులు పంపి.. ఆ అకౌంట్ నుంచి ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. నాకు కూడా సైబర్ క్రిమినల్స్ నుంచి కాల్స్ వచ్చాయి.. యూట్యూబ్‌లో వీడియోస్‌కి లైక్స్ కొడితే డబ్బులు వస్తాయని ఆశ చూపారు. మొబైల్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇచ్చే పర్మిషన్స్ పట్ల అలర్ట్‌గా ఉండాలి. చదువుకున్న వాళ్లే సైబర్ క్రైమ్స్ బారిలో పడుతున్నారు. కర్ణాటక డీజీపీ కూడా సైబర్ క్రైమ్ వలలో పడ్డారు.” అంటూ తెలియజేశారు.

If you like, the account is empty

అంతేకాకుండా హైదరాబాద్ కమీషనరేట్‌లో రోజుకి ఇరవై సైబర్ క్రైమ్ కంప్లయింట్స్ వస్తున్నాయని. మొబైల్ లో ఉండే సెక్యూరిటీ ఫీచర్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని.. చెప్పుకొచ్చారు. ఇక సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. “అవేర్నెస్ వల్ల 60 శాతం సైబర్ క్రైమ్ కేసులను నివారించే అవకాశాలు ఉంటాయి. సైబర్ క్రైమ్‌లో ఫైనాన్షియల్‌గా మోసపోయిన కొందరు జీవితకాలం కోలుకోలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 870 కానిస్టేబుల్స్‌కి సైబర్ క్రైమ్‌పై ట్రైనింగ్ ఇస్తున్నాము. భవిష్యత్‌లో ఫిజికల్ క్రైమ్ కన్నా సైబర్ సెక్యూరిటీ క్రైమ్ కేసులే ఎక్కువగా ఉంటాయి. సైబర్ క్రైమ్ బారిన పడ్డవారెవరైనా 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి కంప్లయింట్ చేయాలి. మోసపోయామని గ్రహించి.. తొందరగా కంప్లయింట్ చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు 130 కోట్ల మనీని హోల్డ్‌లో పెట్టాము. సైబర్ క్రైమ్ బారిన పడ్డవారి నుంచి ప్రతీరోజు 1930 కాల్ సెంటర్‌కి రెండు వేలకు పైగా కాల్స్ వస్తున్నాయి” అంటూ పేర్కొన్నారు. ఏదేమైనా సైబర్ నేరాలపై అవగాహనా ఉంటూ..నిత్యం ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిది. మరి , ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి