iDreamPost

Justice Hima Bindu: చంద్రబాబు స్కాం కేసు తీర్పు ఇచ్చిన జడ్జ్ ఎవరో తెలుసా?

Justice Hima Bindu: చంద్రబాబు స్కాం కేసు తీర్పు ఇచ్చిన జడ్జ్ ఎవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. గంటల తరబడి ఏసీబీ కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. చివరకు కోర్టు సిట్ వాదనలతో ఏకీభవించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఈ రాత్రికి బాబును సిట్ ఆఫీసుకు తీసుకెళ్లి.. సోమవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అనేక విషయాలపై అందరు తెగ సెర్చ్ చేస్తున్నారు. అలానే ఈ కేసులో తీర్పు ఇచ్చిన జడ్జీ  ఎవరు అనే  విషయం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక చంద్రబాబు కేసులో తీర్పు ఇచ్చిన ఏసీబీ న్యాయమూర్తి పూర్తి పేరు.. జస్టిస్‌ బొక్క​ సత్య వెంకట హిమ బిందు. ఏసీబీ కోర్టు జస్టిస్‌గా పని చేయడానికి కంటే ముందు.. అనగా 2016లో అడిషనల్‌ డిస్ట్రిక్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జ్‌, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లాలో విధులు నిర్వహించారు. ఈ ఏడాది అనగా.. 2023, ఏప్రిల్‌ 18న సీబీఐ కేసులకు సంబంధించి ప్రిన్సిపాల్‌ స్పెషల్‌ జడ్జ్‌గా నియమితులయ్యారు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు కేసులో రిమాండ్‌ విధించి.. చట్టం దృష్టిలో అందరూ సమానమే అని నిరూపించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచారు. ప్రస్తుతం ఆమె పేరు మారుమోగిపోతుంది. జస్టిస్‌ హిమ బిందు.. ఉమ్మడి ఏపీలు పలు కోర్టుల్లో న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. గతంలో కూడా ఆమె అనేక సంచలన తీర్పులు ఇచ్చారు.

చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున ఏసీబీ కోర్టుకు.. ఏపీ సీఐడీ అధికారులు రిమాండ్‌ రిపోర్టును సమర్పించింది. సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అనుక్షణం ఉత్కంఠభరితంగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఈ కేసులో.. జస్టిస్‌ హిమ బిందు నిష్పక్షపాతంగా వ్యవహరించారు. సుదీర్ఘ సమయం పాటు ఇరు పక్షాల వాదనలు విన్న ఆమె.. ఎలాంటి ఒత్తడికి లోను కాకుండా.. నిష్పక్షపాతమైన రీతిలో తీర్పు వెల్లడించారు. ఇలాంటి హై ప్రొఫైల్‌ కేసులో హిమ బిందు ఇచ్చిన తీర్పు.. న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల్లో నమ్మకాన్ని మరింత పెంచింది అని కొనియాడుతున్నారు. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు.. చట్టం ముందు అందరూ సమానమే అనే నమ్మకాన్ని సామాన్యుడిలో ఇంకా బ్రతికించే తీర్పు ఇచ్చారు అంటూ జనాలు.. సోషల్‌ మీడియా వేదికగా జస్టిస్‌ హిమ బిందు మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

శనివారం నంద్యాలలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేసి.. విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. అప్పటి నుంచి ఆదివారం సాయత్రం వరకు దాదాపు 40 గంటలుగా ఉత్కంఠ నెలకొంది. 34 అభియోగాలను నమోదు చేసిన సీఐడీ.. చంద్రబాబును 20కిపైగా ప్రశ్నలు సంధించింది. అనంతరం.. సీబీఐ కోర్టులో ఆదివారం తెల్లవారుజామున ప్రవేశపెట్టింది. ఈ కేసులో చంద్రబాబే కుట్రకు ప్రధాన సూత్రదారి అని సీఐడీ ఏసీబీ కోర్టుకు రిమాండ్‌ నివేదిక ద్వారా తెలియజేసింది మొత్తం 28పేజీలతో కూడిన చంద్రబాబు రిమాండ్‌ రిపోర్టును సమర్పించింది. ముఖ్యంగా సీఐడీ రిమాండ్‌ రిపోర్టులో పెట్టిన సెక్షన్ 409పై బలంగా వాదనలు వినిపించింది.

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. సీఐడీ తరపున ఏఏజీ పొన్నబోలు సుధారకర్ రెడ్డి  బలంగా వాదించారు. అంతేకాక చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేశారు. ఆదివారం ఉదయం నుంచి  కొనసాగిన ఉత్కంఠ సాయంత్రం ఏడు గంటలకు తెరపడింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు.. సంచలన తీర్పు ఇచ్చారు. ఈ కేసులో సిట్ వాదనలతో ఏకీభవించిన ఆమె.. చంద్రబాబుకు రిమాండ్ విధించారు. ఈ నెల 22 తేదీ వరకు రిమాండ్ ఇచ్చేలా ఆమె తీర్పు ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి