iDreamPost

TS Budget 2024: కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ.15 వేలు

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయదారులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయదారులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.

TS Budget 2024: కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ.15 వేలు

తెలంగాణ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను శనివారం ప్రవేశపెట్టింది. తమను నమ్మి అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజల సంక్షేమం-అభివృద్ది, ఆరు గ్యారెంటీల అమలు కు ప్రాధాన్యత ఇస్తామని, విద్యా, వైద్య, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని ఇది వాస్తవిక బడ్జెట్ అని రేవంత్ సర్కార్ తెలిపింది. గుణాత్మక మార్పు ను తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతుందని అన్నారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్దంగా ఉంటూ.. ప్రజలకు మేలు జరిగేలా చూస్తామని, ఇనుక కంచెలు బద్దలు కొట్టి ప్రారంభమైన ప్రజా పాలన నిరాటంకంగా కొనసాగుతుందని, అమర వీరుల త్యాగాలు వృధాగా పోనివ్వమని అన్నారు ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క. నేడు రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ హామీలు ఇచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరుపు నుంచి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తొలిసారిగా అసెంబ్లీలో రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలు, వ్యవసాయ, విద్య, మహిళాభివృద్ది గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కౌలు రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ తీపి కబురు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా ఇస్తామని ప్రకటించారు. ఏడాదికి ఒక ఎకరానికి పెట్టుబడి కింద రూ.15 వేలు అందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు బంధు స్కీమ్ ద్వారా అనర్హులు లక్షలు, కోట్లు సంపాదించారు. రైతు బంధుతో పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో అలాంటి మోసాలకు తావివ్వబోమని.. రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేసి అర్హులైన వారికే రైతు బంధు ఇస్తామి భట్టి స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి