iDreamPost

ఢిల్లీ స్టూడెంట్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. 3 రోజుల ముందే పక్కా ప్లాన్‌తో!

  • Published Jul 29, 2023 | 12:29 PMUpdated Jul 29, 2023 | 12:29 PM
  • Published Jul 29, 2023 | 12:29 PMUpdated Jul 29, 2023 | 12:29 PM
ఢిల్లీ స్టూడెంట్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. 3 రోజుల ముందే పక్కా ప్లాన్‌తో!

దేశరాజధాని ఢిల్లీలో కాలేజీ విద్యార్థినిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల ముందు నుంచే విద్యార్థిని హత్యకు స్కెచ్‌ వేశారని.. పక్కా పథకం ప్రకారమే ఆమెని హత్య చేశారని.. పోలీసులు తెలిపారు. ప్రేమ, పెళ్లి విషయంలో చోటు చేసుకున్న గొడవల కారణంగా ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఢిల్లీ మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లోచోటు చేసుకుంది. బాధితురాలిని కమల నెహ్రూ కాలేజీ విద్యార్థినిగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టూడెంట్‌ని హత్య చేసిన వ్యక్తిని.. ఇర్ఫాన్‌గా గుర్తించారు. అతడు, మృతురాలు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇర్ఫాన్‌కు సరైన ఉద్యోగం లేదు. ప్రస్తుతం స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ కారణంగా.. బాధితురాలి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. అప్పటి నుంచి బాధితురాలు.. ఇర్ఫాన్‌తో మాట్లాడటం లేదు. అతడికి దూరంగా ఉంటుంది. ఈలోపు ఇర్ఫాన్‌ తమ్ముడికి పెళ్లి కుదరడంతో.. అవమానంగా భావించాడు. బాధితురాలిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

పక్కా పథకంతో..

బాధితురాలు మాట్లాడకపోయేసరికి ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్.. ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో తన ప్రియురాలు రోజూ స్టెనోగ్రఫీ ట్రైనిం‍గ్‌కు వెళుతుందని ముందే తెలిసిన ఇర్ఫాన్‌.. ఆ సమయంలో ఆమెను కలవాలనుకున్నాడు. ఇందుకు గాను మూడు రోజుల ముందే పథకం పన్నాడు. దీనిలో భాగంగా తన ప్రియురాలిని పార్క్‌కి పిలిచి.. ప్రేమ వ్యవహారం గూరించి మాట్లాడాడు. పెళ్లి చేసుకుందామని అడిగాడు. కానీ బాధితురాలు ఒప్పుకోకపోయేసరికి విచక్షణ కోల్పోయాడు. ఆమె నో చెబితే హత్య చేయాలని భావించి.. ప్రియురాలిని కలవడానికి వచ్చేటప్పుడే తనతో పాటు ఒక ఐరన్‌ రాడ్‌ తెచ్చుకున్నాడు. పెళ్లికి నో చెప్పడంతో.. ఆమె తలపై బాది హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసుకుని మాలవీయ నగర్‌లో స్టెనోగ్రఫీ కోచింగ్‌ కోసం బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు.

ఈ దారుణ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్పందించారు. ‘‘నాగరికత ఉన్న దేశ రాజధానిలో ఓ అమ్మాయిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ఢిల్లీలో మహిళలకు రక్షణ కరవైంది. దీని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం వార్తాపేపర్లలో మాత్రం అమ్మాయిల పేర్లు మారుస్తున్నారు. నేరాలు మాత్రం ఆగడం లేదని’’ ట్వీట్ చేశారు. బాధితురాలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తె మృతికి కారణమైన వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి