iDreamPost

భర్తను వేధిస్తోన్న భార్య.. బాధితుడికి అండగా నిలిచిన హైకోర్టు!

భర్తను వేధిస్తోన్న భార్య.. బాధితుడికి అండగా నిలిచిన హైకోర్టు!

భార్యాభర్తల బంధం అనేది ఎంతో ప్రత్యేకమైనది. కారణం.. భిన్నా అభిప్రాయాలు, వాతావరణాలకు చెందిన ఇద్దరు పెళ్లి అనే గొప్ప కార్యం ద్వారా ఒకటవుతుంటారు. మూడుముళ్ల బంధంతో ఒకటైన ఆ జంట.. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ సంసార జీవితంలో ముందుకు సాగుతుంటారు. అయితే కొన్ని జంటల మధ్య మాత్రం నిత్యం వాదనలు, ఘర్షణలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చట్టాలను అడ్డు పెట్టుకుని కొందరు భార్యలు.. తమ భర్తలను వేధింపులకు గురి చేస్తున్నారు. అలానే ఓ మహిళ కూడా భర్తను వెంటాడి మరీ..వేధిస్తోంది. ఈక్రమంలోనే బాధితుడికి హైకోర్టు అండగా నిలబడింది. అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఢిల్లీకి చెందిన ఓ దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో 2005లోనే వేరుపడ్డారు. ఆ భర్త మాత్రం.. తన భార్య విషయాలను పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకుంటూ జీవిస్తోన్నాడు. అయితే, భార్య మాత్రం భర్తను తరుచూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేసింది. అతడిపై పదే పదే క్రిమినల్‌ కేసులు పెట్టి.. టార్చర్ పెట్టింది. దీంతో ఇరువురి మధ్య కోలుకోలేని పెద్ద అగాథం ఏర్పడింది. ఇక కలసి ప్రయాణం చేయడం అసాధ్యమని భావించిన ఈ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.

కానీ, సదరు భార్య మాత్రం విడాకులకు ససేమిరా అంది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. తన భర్తే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని, ఆయనను తాను వేధిస్తున్నట్టు చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదని వాదించింది.  కాబట్టి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను రద్దు చేయాలని  ఢిల్లీ హైకోర్టును ఆమె కోరింది. ఈ కేసు విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కైటీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్‌ను తిరస్కరించారు. అలా భార్య వేధిస్తోన్న భర్తకు ఢిల్లీ హైకోర్టు అండగా నిలిచింది. మరి.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి