iDreamPost

గుడ్ న్యూస్.. చిన్నారులకు కోవిడ్ టీకా

గుడ్ న్యూస్.. చిన్నారులకు కోవిడ్ టీకా

దేశంలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ పై డిసిజిఐకి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ కీలక సూచనలు చేసింది. 5-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కోవాగ్జిన్, కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు( డిసిజిఐ) కి సిఫార్సు చేసింది. త్వరలో డిసిజిఐ నిర్ణయంతో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే భారత్ లో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. జనవరి 3 నుంచి 15 -18 ఏళ్ల మధ్య పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 16 నుంచి 12 ఏళ్ల పైబడిన వారికి భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నారు.

దేశంలో కోవిడ్ ఉదృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఫోర్త్ వేవ్ మొదలైందా అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీతో సహా మరో నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటాన్ని గుర్తించిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖకు లేఖలు రాసింది.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. బుధవారం మొత్తం 4.49 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,380 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో నిన్నటి కేసులతో పోల్చితే గురువారం ఒక్కరోజే 60శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు పాజిటివిటీ రేటు 5.7శాతానికి పెరిగింది. దేశంలో గడిచిన 24గంటల్లో 56 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి