iDreamPost

డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!

  • Author singhj Published - 07:58 AM, Mon - 31 July 23
  • Author singhj Published - 07:58 AM, Mon - 31 July 23
డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్​లో నిర్ణాయకంగా మారిన చివరిదైన ఐదో టెస్టు మరో కీలక మలుపు తీసుకుంది. గెలుపు ఇంగ్లాండ్​ను దాటి.. ఆస్ట్రేలియా ఖాతాలో పడేలా కనిపిస్తోంది. 384 రన్స్ ఛేదనలో ఆదివారం వర్షం కారణంగా ఆట ముగిసే సరికి ఆసీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 135 రన్స్ చేయడం విశేషం. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (58 బ్యాటింగ్), ఉస్మాన్ ఖవాజా (69 బ్యాటింగ్) పట్టుదలతో క్రీజులో నిలబడ్డారు. కంగారూ జట్టు నెగ్గాలంటే ఆఖరి రోజు మరో 249 రన్స్ చేయాలి. అదే ఇంగ్లీష్ టీమ్ గెలవాలంటే 10 వికెట్లు పడగొట్టాలి.

ఓవర్​నైట్ స్కోరు 389/9తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. మరో ఆరు పరుగులు జోడించి 395 రన్స్​కు ఆలౌటైంది. కెరీర్​లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న బ్రాడ్.. అండర్సన్​తో కలసి బ్యాటింగ్​కు వచ్చినప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లు ‘గార్డ్ ఆఫ్ ఆనర్​’ ఇచ్చారు. ఇంగ్లండ్ ఆలౌటైన తర్వాత ఆసీస్ భారీ టార్గెట్​ను ఛేజ్ చేయడం మొదలెట్టింది. అయితే వాన వల్ల కంగారూ జట్టు 38 ఓవర్లే బ్యాటింగ్ చేయగలిగింది. త్వరత్వరగా ఆసీస్ వికెట్లు పడగొట్టి.. గెలుపు బాటలు వేసుకుందామని చూసిన ఇంగ్లండ్​కు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఎదురు నిలిచారు.

ఇంగ్లండ్ బౌలర్లకు మరో ఛాన్స్ ఇవ్వకుండా వార్నర్, ఖవాజా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ మ్యాచ్​లో వార్నర్ ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్​లో అత్యధిక సార్లు (25) 100 రన్స్ ఓపెనింగ్ పార్ట్​నర్​షిప్ నెలకొల్పిన ప్లేయర్​గా చరిత్ర సృష్టించాడు. ఖవాజాతో కలసి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో ఈ అరుదైన రికార్డును అతడు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో జాక్ హబ్స్, గ్రేమ్ స్మిత్, అలిస్టర్ కుక్ (24) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డులను అధిగమించాడు. ఈ లిస్టులో మైకేల్ అథర్టన్ (23), టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (23) మూడో ప్లేసులో ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి