iDreamPost

వార్నర్ సెంచరీ.. స్టార్ హీరోని ఇమిటేట్ చేస్తూ సెలబ్రేషన్స్! వీడియో వైరల్

  • Author Soma Sekhar Published - 08:08 AM, Sat - 21 October 23

డేవిడ్ వార్నర్ పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. కేవలం 85 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు. ఇక తన శతకం అనంతరం ఓ టాలీవుడ్ స్టార్ హీరోను ఇమిటేట్ చేస్తూ.. సెలబ్రేషన్స్ ను చేసుకున్నాడు.

డేవిడ్ వార్నర్ పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. కేవలం 85 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు. ఇక తన శతకం అనంతరం ఓ టాలీవుడ్ స్టార్ హీరోను ఇమిటేట్ చేస్తూ.. సెలబ్రేషన్స్ ను చేసుకున్నాడు.

  • Author Soma Sekhar Published - 08:08 AM, Sat - 21 October 23
వార్నర్ సెంచరీ.. స్టార్ హీరోని ఇమిటేట్ చేస్తూ సెలబ్రేషన్స్! వీడియో వైరల్

పాకిస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు ఆసీస్ బ్యాటర్లు. తాజాగా వరల్డ్ కప్ 2023లో భాగంగా.. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయారు ఆసీస్ ఓపెనర్లు. ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు భారీ సెంచరీలతో కదం తొక్కడంతో.. ఆసీస్ తొలి వికెట్ కు 259 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ పాక్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 85 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు. ఇక తన శతకం అనంతరం డేవిడ్ భాయ్ ఓ టాలీవుడ్ స్టార్ హీరోను ఇమిటేట్ చేస్తూ.. సెలబ్రేషన్స్ ను చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా శుక్రవారం జరిగిన ఆసీస్-పాక్ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 62 పరుగుల తేడాతో గెలిచింది. కంగారూ ఓపెనర్లు పాక్ బౌలర్లను బెంబేలెత్తించి శతకాలతో చెలరేగారు. మరీ ముఖ్యంగా చిచ్చర పిడుగు వార్నర్ పాక్ బౌలర్లపై ఓ యుద్దాన్నే ప్రకటించాడు. 124 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. టోర్నీలో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. వార్నర్ సెంచరీ చేశాక వెరైటీగా సెలబ్రేషన్స్ చేసుకోవడం మనం చాలా సార్లు చూశాం.

తాజాగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో కూడా డేవిడ్ భాయ్ సెంచరీ తర్వాత తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో తగ్గేదేలే అన్న మేనరిజం చూపిస్తూ.. ప్రేక్షకులను అలరించాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గతంలో కూడా వార్నర్ పుష్ప సినిమా డైలాగ్స్, పాటలకు డ్యాన్స్ లతో అలరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఆసీస్ జట్టులో ఓపెనర్లు వార్నర్(163), మిచెల్ మార్ష్(121)సెంచరీలతో కదంతొక్కారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ జట్టులో కూడా ఓపెనర్లే రాణించారు. ఇమామ్ ఉల్ హక్(70), షఫిక్(64) పరుగులతో రాణించగా.. మిగతా వారు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో జంపా 4, స్టోయినిస్ 2 వికెట్లు తీశారు. మరి డేవిడ్ వార్నర్ పుష్ప రేంజ్ సెలబ్రేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి