iDreamPost

గుండెపోటుతో తండ్రి మృతి.. కూతుర్లే కొడుకుగా మారి అంత్యక్రియలు

గుండె పోటుతో తండ్రి మరణించాడు. కొడుకు లేకపోవడంతో కుతుర్లే కొడుకుగా మారారు. తమ తండ్రి పాడెమోసి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ భావోద్వేగ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

గుండె పోటుతో తండ్రి మరణించాడు. కొడుకు లేకపోవడంతో కుతుర్లే కొడుకుగా మారారు. తమ తండ్రి పాడెమోసి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ భావోద్వేగ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

గుండెపోటుతో తండ్రి మృతి.. కూతుర్లే కొడుకుగా మారి అంత్యక్రియలు

తమ వారసత్వాన్ని నిలబెట్టేందుకు కొడుకు ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. వంశోద్దారకుడి కోసం తిరగని గుడి ఉండదు.. మొక్కని రాయి ఉండదు. కొడుకులు పున్నామ నరకం నుంచి తమను తప్పిస్తాడని అనాదిగా తల్లిదండ్రులు భావిస్తూ వస్తున్నారు. కొడుకు ఉంటే తమ వృ‌ద్ధాప్యంలో అండగా ఉండి, చివరికి అంతిమ సంస్కారాలు చేస్తాడని భావిస్తుంటారు. కానీ ప్రస్తుత కాలంలో కొడుకు కంటే కూతురు ఎందులోనూ తక్కువ కాదంటూ చాలామంది అమ్మాయిలు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా, కొడుకులు ఉన్నా తల్లిదండ్రులను పట్టించుకోని రోజుల్లో.. కూతుర్లే కొడుకుల్లా మారి సేవలు చేస్తుంటారు. ఇక కొడుకులు లేని తల్లిదండ్రులకు కూతురే, కొడుకుగా దహన సంస్కారాలు నిర్వహించిన ఘటనలు చాలా చూస్తున్నాం. అయితే ఇటివలే అనారోగ్యంతో మరణించిన ఓ తండ్రికి కూతుళ్లు కొడుకుగా మారి అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రతి తల్లిదండ్రులకు తాము చనిపోతే కొడుకులే కర్మలు చేయాలి. ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహించాలనే సంప్రదాయం పాటిస్తారు. కానీ, ఇప్పుడు కొంతమంది మహిళల్లో కూడా మార్పులొస్తున్నాయి. పితృ కర్మకాండలు మగపిల్లలే చెయ్యాలనే ఆచారానికి చెక్ పెడుతున్నారు. అడపిల్లలు తలుచుకుంటే ఏమైనా సాధించగలరని నిరూపిస్తున్నారు. ఇటివలే అనారోగ్యంతో చనిపోయిన ఓ తండ్రికి.. నలుగురు కూతుర్లే ఆ నలుగురిగా మారి తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాదమైన ఘటన మణుగూరు మండలం రాజుపేటలో చోటు చేసుకుంది.

మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్ లో నరసింహారావు, గోపమ్మ దంపతులు నివాసముంటున్నారు. అయితే నరసింహరావు సింగరేణి విశ్రాంత ఉద్యోగి కాగా, వీరికి ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం ఈతకు వెళ్లిన కుమారుడు గోదావరిలో మునిగి చనిపోయాడు. ఇక అప్పటి నుంచి ఆ ఇంటికి అన్ని తామే అయ్యి కుతుర్లే అమ్మానాన్నలను చూసుకుంటున్నారు. అంతా సజావుగా సాగుతున్న నేపథ్యంలో నరసింహారావు నిన్న తెల్లవారుజామున త్రీవమైన గుండె నొప్పికి గురైయ్యాడు. అంతలోనే కుటుంబ సభ్యులు అతనికి హాస్పిటల్‌కి తరలించారు.

అయితే చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే.. నరసింహ రావు మృతి చెందాడు. ఇంట్లో మగ దిక్కు లేకపోయే సరికి అన్నీ తామై తమ తండ్రికి చివరి కార్యక్రమాలు నిర్వహించారు ఆ అయిదుగురు కూతుళ్లు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తన తండ్రికి పుట్టెడు దుఃఖంలో పెద్ద కూతురు తలకొరివి పెట్టగా, మిగిలిన నలుగురు కూతుళ్లు పాడే మోస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇది చూసిన స్థానికులు కంటనీరు పెట్టుకుని భావోద్వేగానికిలోనయ్యారు. మరి, అనారోగ్యంతో మరణించిన తండ్రికి అంతక్రియలు నిర్వహించిన ఆ నలుగురు కూతుర్ల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి