iDreamPost

జైలు గేటు వద్ద తల్లి కోసం కూతురు ఎదురుచూపు.. కన్నీటి కథ!

ఇటీవల భార్యాభర్తలు చేస్తున్న తప్పులు వారి పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన తల్లిదండ్రులు వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. వారు చేసే పొరపాటుకు బలిఅవుతున్నారు.

ఇటీవల భార్యాభర్తలు చేస్తున్న తప్పులు వారి పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన తల్లిదండ్రులు వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. వారు చేసే పొరపాటుకు బలిఅవుతున్నారు.

జైలు గేటు వద్ద తల్లి కోసం కూతురు ఎదురుచూపు.. కన్నీటి కథ!

ఈరోజుల్లో తల్లి తండ్రుల చేసిన తప్పులు పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు కన్నవారి కారణంగా అవస్థలు పడుతున్నారు. కన్న వారు ఏం చేస్తున్నారో.. ఎటు పయనిస్తున్నారో ఆ పసి మనసులకు అర్థంకాక తల్లడిల్లిపోతున్నారు. అదర్శంగా నిలవాల్సిన తల్లిదండ్రులే వారి పాలిట శాపంగా మారుతున్నారు. తాజాగా, కర్నూల్ లో జరిగిన ఓ సంఘటన అందరిని కంటతడి పెట్టిస్తుంది. ఒక చోరీ కేసు విషయమై ఓ మహిళను పోలీసులు సబ్ జైలుకు తరలించారు. తన తల్లిని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా అర్థంచేసుకునే వయస్సు లేని కన్న కూతురు… జైలు గేట్ బయట తలుపులు తడుతూ తల్లి కోసం ఏడుస్తూ ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్నూల్ రూరల్ తహసీల్దారు కార్యాలయం వద్ద ఉన్న సబ్ జైలు ఎదుట ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓల్డ్ సిటీకి చెందిన ఓ మహిళను చోరీ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఆ మహిళను సబ్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. తన తల్లి ఏం నేరం చేసిందో ఆమె ఏడేళ్ల కూతురుకి తెలియదు.. కానీ తన తల్లిని అరెస్ట్ చేసి ఫలానా చోటికి తరలించారు అన్న విషయం తెలుసుకుంది. ఈ క్రమంలోనే కన్నీరు పెట్టుకుంటూ జైల్ గేట్ వద్దకు వచ్చి అమ్మను చూడాలి.. అమ్మతో మాట్లాడాలి అంటూ.. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారి బాధ, అక్కడ ఉన్నవారిని కంట తడి పెట్టేలా చేసింది. జైలు లోపల ఉన్న తల్లికోసం అక్కడే అమ్మా.. అమ్మా అంటూ బాధతో పిలుస్తుంటే.. ఆ పాపను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఆ చిన్నారి పిలుపులు ఎంతో ఆవేదనను కలిగిస్తున్నాయి. ఆ పాపకు తల్లిపై ఉన్న ప్రేమ కన్నీటి రూపంలో గుండె లోతుల నుంచి ఉబికివస్తున్న.. ఆ హృదయ విదారక దృశ్యాలు అందరి మనసులను కలచివేశాయి.

ఆ చిన్నారి బాధను చూసి తట్టుకోలేక అక్కడి స్థానికులు జైలు అధికారులను.. ఒక్కసారి ఆ చిన్నారిని తన తల్లితో కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇక మానవతాదృక్పథంతో జైలు అధికారులు ఆ తల్లిని బయటకు పిలిచారు. గొంతు తడారిపోయేలా వెక్కి వెక్కి ఏడ్చిన ఆ చిన్నారి చివరికి తన తల్లిని కలుసుకుంది. ఆ తర్వాత జైలు అధికారులు ఆ పాపను వారి బంధువులకు అప్పగించారు. ఏదేమైనా, తన తల్లి కోసం ఆ పసి హృదయం పడిన ఆవేదన చాలా బాధాకరమైనది. ప్రస్తుతం దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ హృదయ విదారక సన్నివేశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి