iDreamPost

తండ్రి మారడం లేదని.. కుమార్తె షాకింగ్ నిర్ణయం.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేద్దామని నగరానికి వచ్చిన యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన తండ్రిలో మార్పు రావడం లేదని దారుణానికి పాల్పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేద్దామని నగరానికి వచ్చిన యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన తండ్రిలో మార్పు రావడం లేదని దారుణానికి పాల్పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

తండ్రి మారడం లేదని.. కుమార్తె షాకింగ్ నిర్ణయం.. ఇంతకీ ఏం జరిగిందంటే?

తల్లిదండ్రులు పిల్లలపట్ల బాధ్యతను కలిగి ఉండాలి. వారి భవిష్యత్తుకోసం కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పాటుపడాలి. కానీ కొంతమంది తల్లిదండ్రులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తుంటారు. ఏదీ పట్టనట్టుగా వ్యవహరిస్తారు. అంతేగాక వారికున్న చెడు అలవాట్లతో పిల్లలను మరింత ఇబ్బంది పడేలా చేస్తుంటారు. ఇదే రీతిలో ఓ తండ్రి చేసిన పనికి కుమార్తె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎంతకు మారడం లేదని భావించిన ఆ యువతి దారుణానికి ఒడిగట్టింది. తండ్రిలో ఇక మార్పు రాదని భావించి తనువు చాలించింది ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని బోరబండలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పాలకొండకు చెందిన దిడ్డి శ్రీనివాసులు పెద్దకుమార్తె మౌనిక ఇటీవల హైదరాబాద్ కు వచ్చింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసేందుకు తండ్రి, చెల్లి రాధికతో కలిసి నగరానికి వచ్చి రహ్మత్‌నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌ హిల్స్‌ బీజేఆర్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. అయితే మౌనిక తండ్రి మాద్యానికి బానిసై ఎంత చెప్పినా కూడా ఆ అలవాటును మానుకోవడం లేదు. ఈ క్రమంలోనే మౌనిక తీవ్ర మనస్థాపానికి గురైంది. మద్యం సేవించొద్దని ఎన్నిసార్లు చెప్పినా తండ్రిలో మార్పు కనిపించడం లేదని కూతురు మనస్థాపం చెందింది.

Daughter's shocking decision that father is not changing

కాగా ఆదివారం సాయంత్రం మౌనిక తెలిసిన వారింటికి వెళ్లి వచ్చేసరికి తండ్రి శ్రీనివాసులు మద్యం తాగి కనిపించాడు. దీంతో తన తండ్రిలో ఇక మార్పురాదని, తను చనిపోతే అప్పుడైనా మారుతాడని భావించింది. ఇంట్లో ఉన్న చెల్లిని ఏదో పని చెప్పి బయటకు పంపించింది. ఆ తర్వాత గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మౌనిక మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటంబానికి ఆసరగా ఉంటుందనుకున్న కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి