iDreamPost

దుకాణం సర్దేసిన దర్బార్ – ముగింపు వసూళ్లు

దుకాణం సర్దేసిన దర్బార్ – ముగింపు వసూళ్లు

టాలీవుడ్ స్టార్ల మధ్య తదుగునమ్మా అంటూ పోటీకి వచ్చి ఇరుక్కుపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ మొత్తానికి యావరేజ్ కంటెంట్ తో క్లోజింగ్ కు వచ్చేసింది. 9నే వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మహేష్ తోనో బన్నీ తోనో నేరుగా ఢీకొని ఉంటే పరిస్థితి ఊహకందటం కష్టమే. అన్ని ఏరియాలకు కలిపి తెలుగు వెర్షన్ కేవలం 10 కోట్ల షేర్ మాత్రమే రాబట్టడం చూస్తే ఇక్కడ రజని మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. థియేట్రికల్ బిజినెస్ సుమారు 15 కోట్లకు పైగా జరిగినట్టు ట్రేడ్ న్యూస్ ఉండగా కనీసం పెట్టుబడి కూడా వెనక్కు ఇవ్వలేక దర్బార్ మరో డిజాస్టర్ గా సూపర్ స్టార్ ఖాతాలో మిగిలిపోయింది.

గత ఏడాది పేట కంటే కొంత మెరుగ్గా నిలిచినప్పటికీ దర్బార్ మరీ ఘనంగా అయితే రాబట్టుకోలేదు. పోనీ రజని ఇమేజ్ అయినా పని చేసిందా అంటే అదీ లేదు. కేవలం మొదటి రోజు మాత్రమే ఆ బ్రాండ్ ఉపయోగపడిందే తప్ప ఫలితం మాత్రం శూన్యం. నైజామ్ లో నాలుగు కోట్లకు పైగా షేర్ రాబట్టి సరిపోయింది కానీ లేదంటే కలెక్షన్ ఫిగర్ ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇకపై రజని సినిమా అంటే దర్శకుడు ఎవరు అనే దానితో నిమిత్తం లేకుండా బయ్యర్లు భయపడే సీన్ వచ్చేసింది. ఏరియాల వారీగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

దర్బార్ ఫుల్ రన్ వసూళ్లు

ఏరియా  షేర్ 
నైజాం 4.50cr
సీడెడ్  1.25cr
UA 1.27cr
గుంటూరు 0.82cr
కృష్ణ  0.59cr
ఈస్ట్ 0.85cr
వెస్ట్ 0.54cr
నెల్లూరు 0.41cr
ఆంధ్ర తెలంగాణ మొత్తం 10.23cr

VERDICT – FLOP

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి