iDreamPost

కుటుంబం కోసం పెళ్లిని పక్కన పెట్టి.. తొలి ప్రయత్నంలోనే SIగా..

కుటుంబం కోసం పెళ్లిని పక్కన పెట్టి.. తొలి ప్రయత్నంలోనే SIగా..

సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు.. కొంచెం కష్టమైనా.. ఆలస్యమైనా మనం అనుకున్నది జరుగుతుంది. ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది మహబూబాబాద్‌కు చెందిన హేమలత. పేదరికంలో మగ్గుతున్న ఆమె చదువే జీవితంగా బతికారు. ఎప్పటికైనా పెద్ద ఉద్యోగం సంపాదించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే కుటుంబం, చదువు కోసం ఎన్నో త్యాగాలు చేశారు. పెళ్లిని సైతం పక్కన పెట్టేశారు. చివరికి అనుకున్నది సాధించారు. హమాలీ కూతురు అయిన ఆమె ఎస్‌ఐ అయ్యారు. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లాబోయిన ​కుమార స్వామి హమాలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఆయన కూతురు హేమలత తమ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నత చదువుల్ని కూడా డిస్టెన్స్‌లో ద్వారా చదివింది. డిగ్రీ, పీజీలను డిస్టెన్స్‌ ద్వారానే పూర్తి చేసింది. చదువులు పూర్తయిన తర్వాతి నుంచి గ్రూప్‌-1 కోసం సిద్దమవుతోంది. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆమె తన పెళ్లిని సైతం పక్కన పెట్టారు. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నారు. చెల్లి పెళ్లి కూడా జరిపించారు. తాను మాత్రం గవర్నమెంట్‌ ఉద్యోగం సంపాదించే వరకు పెళ్లి చేసుకోనని సపథం పట్టారు.

రాత్రింబవళ్లు కష్టపడి చదివారు. తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐ జాబ్‌ సాధించారు. సివిల్ ఎస్‌ఐగా ఎంపికై ఏజెన్సీ పేరు రాష్ట్ర వ్యాప్తం చేశారు. ఇక, హేమలత ఎస్‌ఐ ఉద్యోగం సంపాదించటంతో కుటుంబసభ్యులతో పాటు, గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి, కుటుంబం, చదువు కోసం పెళ్లిని సైతం పక్కన పెట్టి.. తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐ ఉద్యోగం సంపాదించిన హమాలీ కూతురు హేమలత సక్సెస్‌ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి