iDreamPost

ఓటిటి ఫిక్స్ అయిన మరో రెండు

ఓటిటి ఫిక్స్ అయిన మరో రెండు

కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ మొదలయ్యాక తెలుగులో డైరెక్ట్ ఓటిటి రిలీజులు కొన్ని జరిగాయి కానీ ఒక్కటంటే ఒక్కటి అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేయడం కానీ మెప్పించడం కానీ చేయలేకపోయాయి. థాంక్ యు బ్రదర్, ఏక్ మినీ కథ, అర్ధ శతాబ్దం, సినిమా బండి లాంటివి అయితే యావరేజ్ లేదా డిజాస్టర్ అయ్యాయి కానీ యునానిమస్ గా ఏదీ బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. అటు చూస్తేనేమో థియేటర్లు తెరుచుకునే సూచనలు కనిపించక మూవీ లవర్స్ అల్లాడిపోతున్నారు. అందుకే జూలై నుంచి ఎక్కువ ఎంటర్ టైన్మెంట్ ని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే మెల్లగా ప్రకటనలు వస్తున్నాయి.

ముందుగా రవిబాబు దర్శకత్వం వహించిన క్రష్ జూలై 9న జీ 5 ద్వారా ప్రీమియర్ కాబోతున్నట్టు సమాచారం. ఇంకా ప్రకటన రాలేదు. యూత్ ని టార్గెట్ చేసి తనదైన స్టైల్ లో బోల్డ్ అటెంప్ట్ గా తీసిన ఈ సినిమా షూటింగ్ నెలల క్రితమే పూర్తయ్యింది. అయితే థియేట్రికల్ రిలీజ్ కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాటు ఇది కేవలం కుర్రకారుని ఉద్దేశించి తీసింది కాబట్టి ఫైనల్ గా డిజిటిల్ బాట పట్టారు. పోస్టర్లైతే మరీ అడల్ట్ కంటెంట్ తో నింపేశారు కాబట్టి అసలు సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. నెక్స్ట్ శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ కూడా నేరుగా హాట్ స్టార్ లో రాబోతోంది. ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు కానీ డీల్ ఓకే అయ్యిందని చెన్నై న్యూస్

ఇవి కాకుండా నారప్ప, మాస్ట్రో, దృశ్యం 2 ల గురించి కూడా ఓటిటి వార్తలు వస్తున్నాయి ఇంకా ఏదీ అఫీషియల్ కాలేదు. థియేటర్లు తెరుచుకున్నా లేకున్నా కొందరు మాత్రం డిజిటల్ కే గట్టిగా ఫిక్స్ అయ్యారు. తమిళంలో కూడా ఇటీవలి కాలంలో డీల్స్ పెరిగాయి. ఎటొచ్చి సైలెంట్ గా ఉన్నది ఇప్పటిదాకా టాలీవుడ్ జనాలే. ఇప్పుడు కదలిక వస్తోంది కాబట్టి ఈ బూమ్ కొనసాగవచ్చు. ఏప్రిల్ చివరి వారంలో లాక్ డౌన్ మొదలయ్యాక గత ఏడాది తరహాలో ఈసారి ఓటిటి జోష్ అంతగా లేదు. ఒకవేళ నారప్ప లాంటివి నిజంగా వస్తే మాత్రం ఆపై కొత్త కొత్త ప్రీమియర్లతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి