iDreamPost

కోడలి వివాహేతర సంబంధం.. అత్తకు తెలియడంతో..

వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. జీవిత భాగస్వామి పట్ల విరక్తి.. మరొకరి వైపు చూసేలా చేస్తుంది. కుటుంబాన్ని పట్టించుకోకుండా.. తమ సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు కొందరు. ఇలాంటి దొంగ చాటు వ్యవహారాలన్నీ జీవిత భాగస్వామికి తెలిసిన నాడు.. అఘాయిత్యాలు చోటుచేసుకోవడం లేదంటే విడాకులు తీసుకోవడం జరుగుతున్నాయి.

వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. జీవిత భాగస్వామి పట్ల విరక్తి.. మరొకరి వైపు చూసేలా చేస్తుంది. కుటుంబాన్ని పట్టించుకోకుండా.. తమ సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు కొందరు. ఇలాంటి దొంగ చాటు వ్యవహారాలన్నీ జీవిత భాగస్వామికి తెలిసిన నాడు.. అఘాయిత్యాలు చోటుచేసుకోవడం లేదంటే విడాకులు తీసుకోవడం జరుగుతున్నాయి.

కోడలి వివాహేతర సంబంధం.. అత్తకు తెలియడంతో..

వివాహేతర, అక్రమ సంబంధాలు కొన్ని జీవితాలతో పాటు కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, సతికి తెలియకుండా పతి పరాయి వ్యక్తుల మోజులో పడుతున్నారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా.. తమ సుఖాల కోసం వెంపర్లాడుతుంటారు. ఇలాంటి దొంగ చాటు వ్యవహారాలన్నీ జీవిత భాగస్వామికి తెలిసిన నాడు.. అఘాయిత్యాలు చోటుచేసుకోవడం లేదంటే విడాకులు తీసుకోవడం జరుగుతున్నాయి. దీని వల్ల పిల్లలు అనాథలుగా మారడంతో పాటు కుటుంబం ఛిన్నాభిన్నంగా మారుతుంది. తన అక్రమ సంబంధం గురించి అత్తకు తెలిసిందని.. ప్రియుడితో కలిసి ఆమెను హతమార్చిందో కోడలు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

బెంగళూరులోని బ్యాడర హళ్లిలో నివాసం ఉంటోంది లక్ష్మమ్మ కుటుంబం. ఆమె కొడుకు, కోడలు మంజునాథ్, రశ్మీల వద్ద ఉంటోంది. కాగా, వీరి ఇంటిపై అద్దెకు వచ్చిన అక్షయ్ అనే వ్యక్తితో రశ్మీకి వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే సమయంలో ఇంటి అద్దె కట్టడం లేదని అక్షయ్‌తో లక్ష్మమ్మ గొడవకు దిగింది. అద్దె గురించి అతడిని అడగవద్దని, అది తానే చూసుకుంటానని చెప్పింది కోడలు. దీంతో అత్తకు అనుమానం బలపడింది. ఈ విషయంపై అత్తా, కోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమ ఆనందానికి అడ్డుగా ఉండటంతో పాటు సూటి పోటీ మాటలు అంటుండటంతో భావించిన రశ్మీ.. అత్తను చంపేసేందుకు అక్షయ్, అతడి స్నేహితుడు పురుషోత్తంతో మాట్లాడి పథకం రచించింది.

ఈ నెల 5వ తేదీన కోడలు రశ్మీ.. తన అత్తకు నిద్రమాత్రలు ఇచ్చింది. ఆమె మత్తులోకి జారుకోగా.. అక్షయ్, అతడి స్నేహితుడి సాయంతో గొంతు పిసికి హతమార్చింది. అయితే ఆమె గుండెపోటుతో చనిపోయిందని చెప్పింది. భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశాడు భర్త మంజునాథ్. తన తల్లిదీ సహజ మరణం కాదని భావించిన అతడూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రశ్మీ మొబైల్ చాటింగ్‌ను పరిశీలించిన పోలీసులకు నిజం తెలిసింది. ఆమెను కోడలే హత్య  చేసిందన్న ఆధారాలు దొరకడంతో ముగ్గురిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి, వారిని విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి