iDreamPost

త్రివిక్రమ్ చెప్పినట్లు.. శత్రువులు ఎక్కడో ఉండరు

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ డైలాగ్ ఉంది. శత్రువులు ఎక్కడో ఉండరురా.. చెల్లిళ్లు, కూతుర్ల రూపంలో ఇలా తిరుగుతుంటారు అని. ఇది అతడి విషయంలో నిజమైంది. అయితే ఇక్కడ చిన్న ఛేంజ్. ఇంతకు ఏమైందంటే..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ డైలాగ్ ఉంది. శత్రువులు ఎక్కడో ఉండరురా.. చెల్లిళ్లు, కూతుర్ల రూపంలో ఇలా తిరుగుతుంటారు అని. ఇది అతడి విషయంలో నిజమైంది. అయితే ఇక్కడ చిన్న ఛేంజ్. ఇంతకు ఏమైందంటే..?

త్రివిక్రమ్  చెప్పినట్లు.. శత్రువులు ఎక్కడో ఉండరు

శుక్రవారం అమావాస్య అర్థరాత్రి.. బయటకు వెళ్లిన ఉపాధ్యాయుడు.. ఇంటికి తిరిగి వస్తుండగా.. హత్యకు గురయ్యాడు. దుండగులు ఎవరో ఆయన్ను హత్య చేశారని భావించారంతా. పోలీసులకు సమాచారం వెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హంతకులు ఎక్కడో లేరూ.. కూతురు, భార్య రూపంలో ఆయన ఇంట్లోనే తిరుగుతున్నారని తేలింది పోలీసులకు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆశ్చర్యకరమైన అంశాలు విని ఖాకీలు సైతం కళ్లు తేలేశారు. దీని గురించి ఇంతకు తెగించారా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

తన ప్రేమను అంగీకరించలేదని తండ్రిని తల్లితో కలిసి కూతురు సుపారీ ఇచ్చి చంపించేసింది. తిరిగి తన తండ్రిని చంపిన నిందితుల్ని అరెస్టు చేయాలంటూ పోలీసులకు కూతురు ఫిర్యాదు చేయడం కొసమెరుపు. ఆమె చెప్పినట్లే.. పోలీసులు నిందితులైన తల్లీ, కూతుళ్లను అరెస్టు చేశారు. ఈ హత్య కర్ణాటకలోని తమకూరు జిల్లా కుణిగల్ కులినంజయ్యన్ పాళ్యలో నాలుగు రోజుల క్రితం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడూరు పాఠశాలలో గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు మరియప్ప. అతడికి భార్య శోభ, కూతురు హేమలత ఉన్నారు. కాగా, కూతురు అదే గ్రామానికి చెందిన శాంత కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. తల్లి వీరి ప్రేమకు ఓకే చెప్పింది కానీ తండ్రికి ఇష్టం లేదు. అతడితో ప్రేమ మానుకోవాలని..కూతుర్ని చితకబాదాడు మరియప్ప. దీంతో తండ్రిపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంది కూతురు.

తండ్రిని అంతమొందిస్తే కానీ.. తాము పెళ్లి చేసుకోలేమని భావించిన హేమలత.. తన తల్లి, ప్రియుడు శాంత కుమార్‌తో కలిసి ప్లాన్ రచించింది. శాంత కుమార్ స్నేహితులకు సుఫారీ ఇచ్చారు. మరియప్ప హత్య చేసిన రోజు.. అతడి ప్రతి కదలికలను వారికి చెప్పారు తల్లీ, కూతుళ్లు. అమావాస్య నాడు పూజ ముగించుకుని గ్రామానికి తిరిగి బండిపై వస్తున్న మరియప్పను.. బైక్ పై అడ్డగించి ముఖంపై కారం చల్లారు శాంతకుమార్ అతడి స్నేహితులు. భయాందోళనకు గురైన మరియప్ప బైక్ దిగి పారిపోయాడు. అయినా సరే  వెంబడించి.. అతడిని హత్య చేశారు. ఈ కేసులో మరియప్ప భార్య, కూతురితో సహా.. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రైం కథా చిత్రాన్ని చూస్తుంటే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకు వస్తుందా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి