iDreamPost
android-app
ios-app

షాంపుతో జుట్టు రాలిపోయిందని గొడవ.. భర్త లేని సమయం చూసి

షాపులో నుండి మనకు నచ్చిన ప్రొడక్ట్ ఏదో ఒకటి తెచ్చుకుంటాం. సాధారణంగా అది బాగోకపోతే.. పక్కన పెట్టేసి.. మరోటి తెచ్చుకుంటాం. అంతేకానీ ఏంటీ ఇలాంటిది ఇచ్చావ్ అంటూ ఆ షాపు యజమానిని అడిగేవాళ్లు చాలా తక్కువే ఉంటారు. కానీ ఈ మహిళ

షాపులో నుండి మనకు నచ్చిన ప్రొడక్ట్ ఏదో ఒకటి తెచ్చుకుంటాం. సాధారణంగా అది బాగోకపోతే.. పక్కన పెట్టేసి.. మరోటి తెచ్చుకుంటాం. అంతేకానీ ఏంటీ ఇలాంటిది ఇచ్చావ్ అంటూ ఆ షాపు యజమానిని అడిగేవాళ్లు చాలా తక్కువే ఉంటారు. కానీ ఈ మహిళ

షాంపుతో జుట్టు రాలిపోయిందని గొడవ.. భర్త లేని సమయం  చూసి

ఈ సోప్ వాడండి మీ అందం రెట్టింపు అవుతుంది. ఈ టూత్ పేస్ట్‌తో మీ పళ్లు తళతళ మెరవడం ఖాయం. ఈ షాంపు వాడండి డాండ్రఫ్ తిరిగి రాదు.. అంతేకాదూ హెయిర్ ఫాల్ కూడా ఉండదు. ఈ ట్యాబెట్లు వాడండి ఎంత లావు శరీరమైనా ఇట్టే తగ్గిపోతుంది. ఈ ఆయిల్ రాయండి.. మోకాళ్ల నొప్పులు మటుమాయం అంటూ  పలు ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఇవి చాలవన్నట్లు ఇక బయట కూడా చాలా ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. వీటికి ప్రకటనలు అవసరం లేదు. మౌత్ పబ్లిసిటీ చాలు. ఇక ఏదైనా కొత్తగా బజారులోకి వచ్చిందంటే చాలు.. ట్రై చేసే వాళ్లు అనేక మంది ఉన్నారు. అలా ఓ షాంపు కొన్న మహిళ జుట్ట రాలిపోవడంతో.. ఆ షాపు దగ్గరికి వెళ్లి, అందులో పనిచేస్తున్న వ్యక్తిని ఇలాంటి ప్రొడక్ట్ ఇచ్చావేంటీ అని ప్రశ్నించడంతో.. ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంటిమామిడి జంక్షన్‌కు చెందిన చెల్లంచెర్ల సత్యవతి అనే 66 ఏళ్ల మహిళ.. గాంధీనగర్ వెంకట నారాయణ వీధిలోని యూనియన్ బ్యాంకు ఏటీఎం ఎదురుగా ఉన్న ఓ జనరిక్ మందుల షాపులో మెడిసన్స్ కొనేందుకు వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో 20 రోజుల క్రితం ఓ షాంపు కొనుగోలు చేసింది. అందులో పొన్నాడ వెంకటేశ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆమె షాంపు కొన్నప్పుడు అతడే ఉన్నాడు. సత్యవతి  షాంపు ఉపయోగించిన తర్వాత జుట్టు బాగా రాలిపోయింది. దీంతో దుకాణం వద్దకు వెళ్లి.. జుట్టు ఊడిపోతుందంటూ వెంకటేశ్ తో గొడవపడింది. ఏం షాపు ఇచ్చావయ్యా అంటూ దుర్భాషలాడింది. సత్యవతి తిట్టడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు వెంకటేశ్.

ఆదివారం ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు వెంకటేశ్. భర్త బయటకు వెళ్లిన వెంటనే ఇంట్లోకి ప్రవేశించి.. సమీపంలో కొన్న కత్తితో దాడి చేశాడు. నన్నే తిడతావా అంటూ మెడ, బుగ్గ, చేతిపై దాడి చేశాడు. అంతలో చాకు విరిగిపోవడంతో అక్కడి నుండి పరారయ్యాడు. గాయాలతో ఆమె అరుస్తూ.. బయటకు రాగా, భర్త వెంకటరత్నం చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రస్ట్ ఆసుపత్రిలో ప్రస్తుతం సత్యవతి చికిత్స పొందుతుంది. ఆమెకు ప్రాణాపాయం తప్పింది. భర్త, మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బంగారం కోసమే ఈ దాడి జరిగిందని తొలుత భావించగా.. ఆ తర్వాత అతడ్ని అరెస్టు చేసి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి