iDreamPost

పొద్దున్నపరీక్ష రాసేందుకు వెళ్లిన మెడికో .. సాయంత్రం బీచ్ వద్ద..

కూతుర్ని వైద్యురాలిగా చూడాలని ఆశపడ్డారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు కన్నకలలను నిజం చేసేందుకు నీట్ లో మంచి ర్యాంక్ కొట్టి.. వైద్య విద్యలో చేరింది. ఇంకొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పూర్తి కానుంది. ఓ పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లింది .. కానీ

కూతుర్ని వైద్యురాలిగా చూడాలని ఆశపడ్డారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు కన్నకలలను నిజం చేసేందుకు నీట్ లో మంచి ర్యాంక్ కొట్టి.. వైద్య విద్యలో చేరింది. ఇంకొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పూర్తి కానుంది. ఓ పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లింది .. కానీ

పొద్దున్నపరీక్ష రాసేందుకు వెళ్లిన మెడికో .. సాయంత్రం  బీచ్ వద్ద..

ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టే వైద్య వృత్తిలోకి వచ్చేందుకు ఆమె ఎంబీబీఎస్ చదువుతోంది. కొన్ని రోజులు పోతే ఆమె వైద్య విద్య పూర్తి చేసుకుని.. మంచి వైద్యురాలిగా పేరుగాంచేది. బంగారం లాంటి భవిష్యత్ చూడాల్సిన యువతి.. ఊహించని విధంగా  సముద్రంలో శవమై కనిపించింది. తాను కన్న కళలను విడిచి పెట్టి.. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. బుధవారం సాయత్రం కాకినాడలోని నేమాం బీచ్‌లో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. అందిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టగా.. ఆమె వంకదారి శ్వేత అని నిర్ధారణ అయ్యింది. ఆమె ఓ మెడికో అని తేలింది.

తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ సూర్యనారాయణ పురం రంగయ్య నాయుడు వీధిలో నివసిస్తోంది కుభేరరావు, ఆశాజ్యోతి కుటుంబం. వారికి ఇద్దరు పిల్లలు. శ్వేత నీట్‌లో జనరల్ కేటగిరిలో 714 ర్యాంక్ సాధించగా.. రంగరాయ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. 2018-19లో జాయిన్ అయ్యింది. గురువారంతో పరీక్షలు ముగియనుండగా.. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాస్తోంది. బుధవారం ఉదయం తండ్రి కుభేరరావు.. కాకినాడ ప్రభుత్వాసుపత్రి వద్ద దింపి వెళ్లిపోయాడు. తండ్రి వెళ్లిన తర్వాత పరీక్ష హాలులోకి వెళ్లలేదు శ్వేత. పది నిమిషాల తర్వాత కాలేజీ నుండి బయటకు వెళ్లిపోయింది. ఏమైందే ఏమో కానీ సుర్యారావు పేట బీచ్ లో విగత జీవిగా పడి ఉంది.

అదే రోజు సాయంత్రం ఆమె మృతదేహం బీచ్ వద్దకు కొట్టుకు వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  ఉదయం కాలేజీ వద్ద ఆమెను విడిచి పెట్టి ఇంటికి వెళ్లిపోయిన తండ్రికి.. సాయంత్రం ఆమెను తీసుకు వచ్చేందుకు వెళుతుండగా.. పోలీసుల నుండి సమాచారం అందింది. సముద్రం ఒడ్డున కూతురు మృత దేహం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. శ్వేత సోదరుడు హైదరాబాద్ లో పీహెచ్డీ చేస్తున్నాడు. అయితే ఆమె ఎందుకు చనిపోయిందే తెలియరాలేదు. ఇది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి