iDreamPost

రీల్స్, వీడియోలు వద్దన్న భర్త.. తల్లిదండ్రులతో కలిసి భార్య..

ఇప్పుడంతా కలికాలం కాదూ.. సోషల్ మీడియా కాలం. చేతిలో ఫోన్.. ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే చాలు.. గంటలు గంటల పాటు సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ. కొంత మంది ఫేమస్ అయ్యేందుకు రీల్స్, షాట్స్ అంటూ వీడియోలు చేస్తూ నెట్టింట్లో పెడుతున్నారు. ఇవే..

ఇప్పుడంతా కలికాలం కాదూ.. సోషల్ మీడియా కాలం. చేతిలో ఫోన్.. ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే చాలు.. గంటలు గంటల పాటు సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ. కొంత మంది ఫేమస్ అయ్యేందుకు రీల్స్, షాట్స్ అంటూ వీడియోలు చేస్తూ నెట్టింట్లో పెడుతున్నారు. ఇవే..

రీల్స్, వీడియోలు వద్దన్న భర్త..  తల్లిదండ్రులతో కలిసి భార్య..

సోషల్ మీడియా పుణ్యమాని సామాన్యులు చాలా మంది ఫేమస్ అయ్యారు. సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. వారిని కొంత మంది స్ఫూర్తిగా తీసుకుని.. తాము నేమ్, ఫేమ్ తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టా‌గ్రామ్, స్నాప్ చాట్, ఎక్స్, టిక్ టాక్ ( ప్రస్తుతం ఇండియాలో బ్యాన్) వాటిల్లో తమ వీడియోలను అప్ లోడ్ చేస్తూ..వైరల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.యువతే కాదూ.. మహిళలు, పురుషులు కూడా రీల్స్, షాట్స్ చేస్తూ.. నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. కొంత మందికి అదొక వ్యసనంలా మారిపోయింది. ఇక వేరే వాటిపై ధ్యాస పెట్టడం లేదు. భార్యా/భర్త, పిల్లల్ని పట్టించుకోకుండా వీడియో షూట్స్ చేసుకుంటున్నారు. ఇలానే రీల్స్ పిచ్చిలో పడిపోయిన భార్యను వద్దని వారించాడు భర్త.

వీడియోలు చేయొద్దని చెప్పినందుకు భార్య, తన తల్లిదండ్రులతో కలిసి.. భర్తను చంపేసింది. ఈ ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లో చోటుచేసుకుంది. ఈ హత్యకాండ వివరాలు ఇలా ఉన్నాయి. సమస్తిపూర్ జిల్లాలోని నర్షన్ గ్రామానికి చెందిన మహేశ్వర్‌కు ఖోడాబంద్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫఫౌట్ గ్రామ నివాసి రాణి కుమారితో ఆరేడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మహేశ్వర్ కూలీ పనుల నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లోని కోల్ కత్తాకు వెళ్లాడు. భర్త లేకపోవడంతో ఆ ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాపై పెట్టింది రాణి. అలా తాను ఫేమస్ అయ్యేందుకు వీడియోలు చేయడం స్టార్ చేసింది. ఇన్ స్టా, యూట్యూబ్ రీల్స్, షాట్స్ చేస్తూ ఉండేది. ఈ విషయం ఇటీవల కోల్ కత్తా నుండి తిరిగి వచ్చిన భర్తకు తెలిసింది. అయితే వీడియోలు చేయొద్దని భార్య రాణికి చెప్పాడు భర్త.

ఈ విషయం మింగుడు పడలేదు రాణికి. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపైనే మాట్లాడేందుకు అత్తగారింటికి వెళ్లాడు మహేశ్వర్. రాణితో రీల్స్ చేయించొద్దని చెప్పగా.. గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య, అత్తమామలు కలిసి మహేశ్వర్‌ను హత్య చేశారు. ఆదివారం రాత్రి 10.30కు మహేశ్వర్ సోదరుడు.. అతడికి ఫోన్ చేయగా.. మరొకరు ఫోన్ ఎత్తారు. అతడికి అనుమానం వచ్చి రాణి గ్రామానికి వెళ్లాలని తండ్రికి చెప్పాడు బాధితుడి సోదరుడు. అక్కడి వెళ్లి చూడగా.. మహేశ్వర్ చనిపోయి కనిపించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రీల్స్, వీడియోలు చేయొద్దన్నందుకు మహేశ్వర్ ను భార్య, అత్తమామలు కలిసి గొంతు నులిమి చంపేశారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి మృతదేహాన్ని స్వాధీన పర్చుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్య అదుపులోకి తీసుకొని విచారించగా.. వీడియోలు చేస్తుండటాన్ని భర్త వ్యతిరేకించడంతోనే హత్య చేసినట్లు అంగీకరించిందని తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రీల్స్, వీడియోస్ చేయద్దన్నందుకు భర్తను చంపేసిన భార్య ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి