iDreamPost

టీమిండియాని ముంచేస్తున్న స్క్రాప్.. వీళ్ళు మారరా?

ఇంగ్లాండ్ పై తొలి టెస్ట్ లో ఓడిపోయిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు. జట్టులో స్క్రాప్ ఎక్కువైందని, వారిని తీసేస్తేనే ఇండియాకు విజయాలతో పాటుగా కప్పులు వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్ పై తొలి టెస్ట్ లో ఓడిపోయిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు. జట్టులో స్క్రాప్ ఎక్కువైందని, వారిని తీసేస్తేనే ఇండియాకు విజయాలతో పాటుగా కప్పులు వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.

టీమిండియాని ముంచేస్తున్న స్క్రాప్.. వీళ్ళు మారరా?

వరల్డ్ కప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. టీమిండియా టైటిల్ కు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, సౌతాఫ్రికా టూర్ లో గొప్పగా రాణించింది. ఇక అదే జోరును సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో చూపించాలనుకుంది. కానీ అనూహ్యంగా తొలి టెస్ట్ తోనే షాకిచ్చింది పర్యాటక జట్టు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు మూకుమ్మడిగా విఫలం కావడంతో.. 28 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ పరాజయం తర్వాత నెటిజన్స్ నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టులో స్క్రాప్ ఎక్కువైందని, వారిని తీసేస్తేనే ఇండియాకు విజయాలతో పాటుగా కప్పులు వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి టీమిండియాను ముంచేస్తున్న ఆ ప్లేయర్లు ఎవరు? ఆ వివరాలు చూద్దాం.

టీమిండియాలోని కొంత మంది ప్లేయర్లు గత కొంతకాలంగా దారుణంగా విఫలం అవుతూ వుస్తున్నారు. కేవలం ఒకటి రెండు మ్యాచ్ ల్లో రాణించి.. ఆ తర్వాత మిగతా మ్యాచ్ ల్లో తమ పూర్ ఫామ్ తో టీమ్ కు భారంగా మారుతున్నారు. అందులో కొందరు సీనియర్ ప్లేయర్లు కూడా ఉండటం షాకింగ్ న్యూస్. ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత భారత ఆటగాళ్లపై విమర్శులు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో టీమిండియాలో చెత్త ఎక్కువైందని, వీళ్లు ఇక మారరా? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

నెటిజన్లు విమర్శిస్తున్న వారిలో శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, జడేజాలతో పాటుగా కొత్తగా జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ వీరితో పాటుగా మిస్టర్ 360 ప్లేయర్ గా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు. దాదాపు వీరందరూ స్టార్ క్రికెటర్లే అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మ్యాచ్ విన్నర్లు మాత్రం కాదని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మ్యాచ్ విన్నర్లు అంటే గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, ధోనిలా ఉండాలని వారి అభిప్రాయం. ఎందుకంటే? ఈ మాజీ క్రికెటర్ల కెరీర్ ను ఒకసారి పరిశీలిస్తే.. వారు మ్యాచ్ ఓడిపోయే దశలో ఉంటే, చివరి దాకా క్రీజ్ లో నిలబడి జట్టుకు విజయాన్ని అందించిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రస్తుతం టీమిండియాలో ఇలాంటి ఆటగాళ్లు లేరన్నది వారి అభిప్రాయం.

అయితే తమదైన రోజు వస్తే.. గిల్, అయ్యర్, ఇషాన్, సూర్యలు 200 అయినా కొడతారు. కానీ కీలక మ్యాచ్ ల్లో పూర్తిగా చేతులెత్తేస్తారు. ఈ విషయం వరల్డ్ కప్ లో రుజువైంది కూడా. గిల్ చివరి 10 ఇన్నింగ్స్ ల్లో అతడి అత్యధిక స్కోర్ 36 అంటేనే అర్ధమవుతోంది.. అతడు ఎలాంటి ఫామ్ లో ఉన్నాడని. ఇక బౌలింగ్ విభాగంలో కూడా భారత జట్టుకు సరైన మ్యాచ్ విన్నర్ లేడు. గత టీమ్ ను చూసుకుంటే.. టీమ్ లో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, అగార్కర్ లాంటి వారు తమ బ్యాట్ కు పనిచెప్పేవారు. కానీ ఇప్పుడు టీమిండియాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ప్రస్తుతం ఉన్న భారత జట్టులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చివరి వరకూ క్రీజ్ లో నిలబడి గెలిపించే ఆటగాళ్లే కరువైయ్యారు. ఇప్పుడ భారత జట్టు ఈ విషయంపై ఫోకస్ పెట్టి మ్యాచ్ విన్నర్లను తయ్యారు చేసుకోవాలి. రిషబ్ పంత్, యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్ లాంటి మ్యాచ్ విన్నర్లను మరికొంత మందిని ట్రైన్ చేయాలి. లేకుంటే భవిష్యత్ లో టీమిండియాకు కష్టాలు తప్పవని క్రీడా పండితులు హెచ్చరిస్తున్నారు. స్టార్ ఆల్ రౌండర్ జడేజా అప్పుడప్పుడు మెరుస్తున్నాడే తప్ప కంటిన్యూస్ గా రాణించడం లేదని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. విఫలం అవుతున్న ఆటగాళ్లు ఇంక మారరా? అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరి టీమిండియాలో మ్యాచ్ విన్నర్లు లేరని, వారిని రెడీ చేసుకోవాలన్న నెటిజన్ల కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Rajat Patidar: బాగా ఆడుతూ ఔట్‌! ఇంతకంటే దురదృష్టం ఉంటుందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి