iDreamPost

టీమిండియాకి మరో రైనా దొరికేశాడా? నెట్టింట తెలుగు కుర్రాడిపై ప్రశంసలు..!

టీమిండియాకి మరో రైనా దొరికేశాడా? నెట్టింట తెలుగు కుర్రాడిపై ప్రశంసలు..!

తిలక్ వర్మ.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమ్రోగుతోంది. వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో తెలుగు కుర్రాడు అద్భుతంగా రాణించాడు. ఒక్క టీమిండియా అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం అతని ప్రతిభను కీర్తిస్తోంది. ఆడేది తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అనే భయం, బెరుకు ఏమాత్రం లేకుండా అతను ఆడిన తీరు అందరినీ అలరిస్తోంది. ఒక్క బ్యాటింగ్ లోనే కాకుండా తిలక్ వర్మ అటు ఫీల్డింగ్ లో కూడా శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు అంతా మరో సురేశ్ రైనా దొరికేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

టీ20ల్లో టీమిండియా, క్రికెట్ ఫ్యాన్స్ సురేశ్ రైనాను మిస్ అవుతున్న విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్ లో ఒక సరైన హిట్టర్ లేని లోటు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ఇక నుంచి ఆ లోటు ఉండదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్లేస్ ని భర్తీ చేసేందుకు తిలక్ వర్మ దొరికేశాడు అని సంబరాలు చేసుకుంటున్నారు. అతను ఆడింది ఒకటే ఇంటర్నేషనల్ టీ20 అయినప్పటికీ అతని గేమ్ స్టైల్ మొత్తం సురేశ్ రైనాను గుర్తు చేసిందని చెబుతున్నారు. అప్పటి వరకు టీమిండియాని ఇబ్బంది పెడుతున్న విండీస్ బౌలర్లను ఏదో గల్లీ క్రికెటర్లను కొట్టినట్లు తిలక్ వర్మ కొట్టిన తీరు అందరినీ సంభ్రమాశ్యర్యాలకు గురి చేసింది.

తిలక్ వర్మ సురేశ్ రైనా అభిమాని అందరికీ తెలిసిందే. పైగా ఎడమచేతి బ్యాటర్ కావడంతో.. అతను ఆడే షాట్స్ అచ్చు సురేశ్ రైనా క్లాసీ షాట్స్ లాగానే ఉన్నాయి. పైగా అతని తెగువ, భయం లేకుండా ఆడుతున్న తీరు కూడా సురేశ్ రైనాను తలపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో ఎదుర్కొన్న రెండో బంతినే డీప్ మిడ్ వికెట్ లో సిక్స్ కొట్టిన తీరు మాజీ క్రికెటర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా ఒకటి కాదు.. వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. టీమిండియా భవిష్యత్ ఇలాంటి ఆటగాళ్ల చేతుల్లోనే ఉంది. ఇలాంటి కుర్రాళ్లే క్రికెట్ కు భవిష్యత్ అంటూ మాజీలు కూడా కామెంట్ చేస్తున్నారు. టీమిండియా ఆటలో ఓడిపోయినా కూడా ఫ్యాన్స్ బాధ పడటం లేదు. ఎందుకంటే తిలక్ వర్మ ఆల్రౌండ్ ప్రదర్శన చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నారు.

అటు ఫీల్డింగ్ లో కూడా తిలక్ మెరుపులు మెరిపించాడు. బౌడరీ దగ్గరి నుంచి దాదాపు 10 మీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో రెండు స్టన్నింగ్ క్యాచ్ లు, బ్యాటింగ్ లో కేవలం 22 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అందులో 3 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. ఈ సిరీస్ లో ఇంకా 4 టీ20 మ్యాచ్ లు ఉన్నాయి. ఈ సిరీస్ మొత్తంలో తిలక్ వర్మకు అవకాశాలు కల్పిస్తే.. మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తాయని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్లంతా తిలక్ వర్మ ఆట చూసి ఎంతో మురిసిపోతున్నారు. అటు ఐపీఎల్ లో కూడా తిలక్ వర్మ తానేంటో నిరూపించుకున్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ ఇప్పటికే రెండు సీజన్లు ఆడాడు. 2022 సీజన్లో 14 మ్యాచ్ లు ఆడి 397 పరుగులు చేశాడు. 61 పరుగులు అత్యధిక స్కోర్ గా ఉంది. 2023 సీజన్లో 11 మ్యాచుల్లో 343 పరుగులు చేశాడు. హైఎస్ట్ స్కోర్ 84 పరుగులు నాటౌట్ గా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి