iDreamPost

రమ్య రఘుపతికి షాకిచ్చిన కోర్టు.. నరేశ్ ఇంట్లోకి నో ఎంట్రీ అంటూ..!

రమ్య రఘుపతికి షాకిచ్చిన కోర్టు.. నరేశ్ ఇంట్లోకి నో ఎంట్రీ అంటూ..!

నరేశ్- పవిత్రా లోకేశ్ లీడ్ రోల్స్ లో మళ్లీ పెళ్లి అనే సినిమా తీసిన విషయం తెలిసిందే. అది ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆ సినిమా ఓటీటీ రిలీజ్ నిలిపివేయాలంటూ రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించింది. బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజెక్షన్ దావా దాఖలు చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం రమ్య రఘుపతికి షాకిచ్చింది. బుధవారం జరిపిన విచారణలో న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత మెరిట్ లేని కారణంగా రమ్య రఘుపతి దావాను కొట్టేసింది.

అంతేకాకుండా సినిమా విషయంలో కోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. సినిమా విడుదలను అడ్డుకోవాలని చూపిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని వ్యాఖ్యానించింది. బోర్డ్ ఆఫ్ ఫిలిం సెర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించిన విధంగా ఇదంతా కల్పితమైన కంటెంట్ గా న్యాయస్థానం నిర్ధారణకు వచ్చింది. ఒక్కసారి సెన్సార్ బోర్డు ఈ సినిమాకి కల్పితమని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఒక ప్రైవేటు వ్యక్తి మూవీని అడ్డుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ ఒక్కటే కాదు.. రమ్య రఘుపతికి డబుల్ షాక్ తగిలింది. ఆమెకు నరేశ్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధించింది.

నరేశ్ ఫ్యామిలీ మెంబర్స్ రమ్య రఘుపతి నానక్ రామ్ గూడ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు జారీ చేయాలని వేసిన దావాను కోర్టు స్వీకరించింది. వాళ్లు సమర్పించిన ఆధారాల ప్రకారం ఆ ప్రాపర్టీని రమ్య రఘుపతి బిజినెస్ పర్పస్ లో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడకు గుర్తుతెలియని వాళ్లు వచ్చిపోవడం వల్ల అక్కడ నివసించే సీనియర్ సిటిజెన్స్, నరేశ్ ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత రమ్య రఘుపతిని నరేశ్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా నరేశ్ కు విడాకుల కోసం మార్గం సుగుమం అయ్యిందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే నరేశ్- రమ్య రఘుపతి గత ఆరేళ్లుగా కలిసి ఉండటం లేదని కోర్టు నిర్ధారించింది. సుప్రీం నిబంధనల ప్రకారం.. భార్యాభర్తలు రెండు, అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు దూరంగా ఉంటే వారి వివాహం రద్దు అవుతుంది. ఈ తీర్పుతో నరేశ్ కు రమ్యతో విడాకులు తీసుకునేందుకు మార్గం మరింత సులభం అయిందని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి